Kevvu Karthik :బుల్లితెర నటుడు కెవ్వు కార్తీక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రముఖ టీవీ ఛానల్ ఈటీవీ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా నటుడు కార్తీక్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.జబర్దస్త్ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో ఎన్నోస్టేజ్ షోలు, ఈవెంట్లలో తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఇదిలా ఉంటే తాజాగా కార్తీక్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కార్తీక్ తల్లి మరణించారు. గత కొంత కాలంగా కార్తీక్ తల్లి క్యాన్సర్‌తో పొరాడుతున్నారు. బుధవారం రాత్రి ఆమె కన్నుమూశారు.
ఈ సందర్భంగా కార్తీక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తల్లిని గుర్తు చేసుకుంటూ.. ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ”అమ్మా గత 5 సంవత్సరాల 2 నెలలు గా క్యాన్సరే భయపడే విధంగా ఆ మహమ్మారిపై తీవ్ర పోరాటం చేసావు.. నీ జీవితం అంతా యుద్ధమే. మమ్మల్ని కన్నావు.. నాన్నకి తోడుగా ఉంటూ కష్టాల్లో కూడా కంటికి రెప్పలా మమల్నిచూసుకున్నావ్.అమ్మా ఈ 5 సంవత్సరాల నుండి ఎలా ఒంటరిగా పోరాడాలో నాకు నేర్పించావు. నీ ఆత్మస్థైర్యం నాలో ధైర్యాన్ని నింపింది. అన్నీనేర్పించావు కానీ నువ్వు లేకుండా ఎలా బతకాలో మాత్రం నేర్పించలేదు ఎందుకు అమ్మా..అంటూ కార్తీక్ ఎమోషనల్ పోస్ట్ చేసాడు.తన అమ్మ కోసం కోసం ప్రార్దించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసాడు.తన తల్లికి ట్రీట్మెంట్ చేసిన వైద్యులకు పాదాభివందనాలు తెలియజేయాలజేస్తున్నానని కార్తీక్ పేర్కొన్నాడు.