ICC Banned NCL USA: అమెరికా జాతీయ క్రికెట్ లీగ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) పెద్ద షాక్ ఇచ్చింది. నిబంధనల ఉల్లంఘన కారణంగా అమెరికా క్రికెట్ లీగ్‌పై ఐసీసీ నిషేధం విధించింది. అమెరికా క్రికెట్ లీగ్ తదుపరి సీజన్‌ను నిర్వహణకు నిరాకరించిందని ఐసీసీ తెలిపింది. ఒక్క పొరపాటు వల్ల ఈ అమెరికన్ క్రికెట్ లీగ్ భారీ నష్టాలను చవిచూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Also Read: Neelam Bhardwaj: చరిత్ర సృష్టించిన నీలం.. డబుల్ సెంచరీ చేసిన పిన్న వయస్కురాలిగా రికార్డ్
అమెరికాలోని నేషనల్ క్రికెట్ లీగ్‌లో నిబంధనలను ఉల్లంఘించిన తర్వాత ఐసీసీ కఠినమైన చర్యలు తీసుకుంది. దీనితోనే లీగ్‌ని నిషేధించింది. నిబంధనల ప్రకారం ఈ లీగ్‌లోని ప్రతి జట్టుకు 7గురు మంది అమెరికన్ ఆటగాళ్లు, 4గురు విదేశీ ఆటగాళ్లు ఉండటం తప్పనిసరి. అయితే, లీగ్ నిర్వాహకులు ఈ నిబంధనను ఉల్లంఘించాయి. ఈ నిబంధనను ఉల్లంఘించినట్లు ఐసీసీకి సమాచారం అందింది. అంతేకాకుండా వీసా నిబంధనలను కూడా నిర్వాహకులు ఉల్లంఘించారు. దాంతో ఐసీసీ ఆలస్యం చేయకుండా లీగ్‌పై నిషేధం విధించింది. అమెరికా క్రికెట్ లీగ్‌ను నిషేధిస్తున్నట్లు ఐసీసీ లేఖ రాస్తూ సమాచారం ఇచ్చింది. దింతో నేషనల్ క్రికెట్ లీగ్ యొక్క తర్వాతి సీజన్ నిర్వహించబడదు.
Also Read: Students Missing in Vizag: ‘లక్కీ భాస్కర్’ సినిమా చూశారు.. 9వ తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు..!
ఈ లీగ్‌లో ‘గాడ్ ఆఫ్ క్రికెట్’, భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా భాగముంది. మరోవైపు, మాజీ పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్, వెస్టిండీస్ మాజీ బ్యాట్స్‌మెన్ వివియన్ రిచర్డ్స్‌లు అమెరికన్ క్రికెట్ లీగ్‌తో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు. లీగ్ ఈ ఇద్దరు లెజెండ్‌లను అంబాసిడర్‌లుగా చేసింది. వీరితో పాటు సునీల్ గవాస్కర్, సనత్ జయసూర్య, వెంకటేష్ ప్రసాద్, జహీర్ అబ్బాస్, దిలీప్ వెంగ్‌సర్కార్, మొయిన్ ఖాన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు ఈ లీగ్‌తో సంబంధం కలిగి ఉన్నారు. ఈ ఆటగాళ్లు నేషనల్ క్రికెట్ లీగ్ టీమ్‌ల మెంటార్‌లుగా, కోచ్‌లుగా పని చేసారు.