Site icon NTV Telugu

Wedding procession: అందరిలా చేస్తే ఏముంటది.. వెరైటీ ఉండాల్సిందే

Wedding Procession

Wedding Procession

Wedding procession: పెళ్లి అనేది ఓ పండుగలా చేసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకు ఎంత ఖర్చుకైనా వెనకాడరు. కొందరు వినూత్నంగా చేసుకోవాలని కూడా భావిస్తారు. ఈ క్రమంలోనే గుజరాత్ రాష్ట్రం నవ్‌సారి జిల్లా కలియారి గ్రామానికి చెందిన కేయూర్ పటేల్ తన పెళ్లిని వెరైటీగా చేసుకోవాలనుకున్నాడు. కేయూర్ పటేల్ వినూత్నంగా జేసీబీపై ఊరేగింపుగా కల్యాణ మండపానికి వెళ్లాడు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి జేసీబీని పూలతో అలంకరించాడు. జేసీబీ ముందుభాగంలో ఉండే వోబాక్స్‌లో సోఫాను ఉంచాడు, ఎండ తగలకుండా వోబాక్స్‌పైన పందిరి ఏర్పాటు చేశాడు.

Read Also: Woman Rings Doorbells : అర్ధరాత్రులు నగ్నంగా డోర్ బెల్స్ కొడుతున్న మహిళ

అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగింపుగా కళ్యాణ మండపానికి చేరుకున్నాడు. పెళ్లి అనంతరం తన సతీమణితో కలిసి అదే జేసీబీపై ఊరేగింపు జరుపుకున్నారు. బుల్డోజర్‌పై ఊరేగింపుగా వెళ్తున్న నూతన జంటను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. జేసీబీ ముందు బంధువులు, స్నేహితులు డ్యాన్స్ లు చేస్తూ ముందుకు సాగుతుండగా.. నూతన జంట ఏంచక్కా జేసీబీ వోబాక్స్ లో ఏర్పాటు చేసిన సోఫాపై కూర్చొని ఊరేగింపులో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెండ్లి వేడుకలో భాగంగా వధువు, వరుడు ఎక్కువగా కార్లు, ఇతరు వాహనాల్లో, గుర్రపు బండ్లపై ఊరేగింపుగా పెళ్లి మండపానికి వస్తుంటారు. ఇటీవల ఓ వధువు పెళ్లి మండపానికి లారీ నడుపుకుంటూ వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Read Also: A man With 12 Wives: పుట్ల కొద్దీ పిల్లల్ని కన్నడు.. ఇప్పుడు ప్లానింగ్ అంటున్నడు..

Exit mobile version