మహీర క్రియేషన్స్, సుప్రియ ఆర్ట్స్ బ్యానర్ల పై దొమ్మరాజు అమరావతి, శ్రీకాంత్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నా లవ్ స్టోరీ” ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి లాంచ్ చేశారు. ఈ చిత్రానికి వినయ్ గోను దర్శకత్వం వహిస్తున్నారు ఈ సందర్భంగా అజయ్ భూపతి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
READ MORE: PM Modi: అమెరికా టూర్ విశేషాలను సోషల్ మీడియాలో పంచుకున్న మోడీ
“నేను, వినయ్ గోను రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్స్ గా పని చేశాం ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా పోస్టర్ ను లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. ఈ పోస్టర్ చాలా యూనిక్ గా ఉంది. స్టూడెంట్స్ హాస్టల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక కొత్త తరహా ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.” అని పేర్కొన్నారు. ఈ సినిమా ద్వారా పెద్ద సక్సెస్ సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ సినిమా పోస్టర్ ను లాంచ్ చేసిన దర్శకుడు అజయ్ భూపతికి వినయ్ గోను ధన్యవాదాలు తెలిపారు. మార్చి నెల మొదటి వారం నుంచి ఈ చిత్రం తొలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు వెల్లడించారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, ఈ చిత్రంలో లీడ్ రోల్ లో నటిస్తున్న మోహిత్ పెద్దాడ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
READ MORE: Prakasam: కొడుకుని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన కన్నతల్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?