Site icon NTV Telugu

పవన్‌తో నిధి అగర్వాల్‌ ఆ వార్తలు అవాస్తవం

హరిహర వీరమల్లు మూవీ షూటింగ్‌ నుంచి హిరోయిన్‌ నిధి అగర్వాల్‌ను తప్పించారనే వార్తలను చిత్ర యూనిట్‌ ఖండించింది. ఇది పూర్తిగా అవాస్తవమని తెలిపింది. పవస్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హిరోగా క్రిష్‌ డైరెక్ట్‌ చేస్తున్న చిత్రం హరిహర వీర మల్లు ఇప్పటికే ఈ సినిమాను క్రిష్‌తోపాటు మరో డైరెక్టర్‌ ఆనంద్‌ సాయి భారీ యాక్షన్‌ చిత్రాలను తెరకెక్కించేందుకు రాజస్థాన్‌లో ప్లాన్‌ చేస్తున్నారు. కాగా ఈ చిత్ర రెగ్యూలర్‌ షూటింగ్‌ డిసెంబర్‌ మూడో వారం నుంచి ప్రారంభం కానుంది.

ఈ చిత్రం పై పవన్‌ అభిమానులతోపాటు సాధారణ ప్రజల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ భీమ్లానాయక్‌ చిత్ర షూటింగ్‌లో బీజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ అనంరతం జనవరి 2022 నుంచి హరిహర వీరమల్లు రెగ్యూలర్‌ షూటింగ్‌లో పాల్గొంటారని చిత్ర యూనిట్‌ తెలిపింది. భీమ్లానాయక్‌ టీజర్‌ను దగ్గుబాటిరానా బర్త్‌డే సందర్భంగా డిసెంబర్‌ 14న విడుదల చేయనున్నారు.

Exit mobile version