NTV Telugu Site icon

Mrs Movie: Zee5 ఒరిజినల్ చిత్రం ‘మిసెస్’ కు విశేషమైన స్పందన.. గూగుల్‌లో బంఫర్ రేటింగ్

Mrs

Mrs

‘మిసెస్’ చిత్రం ZEE5 ఫ్లాట్ ఫాంపై సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే 150 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలతో దూసుకుపోతోంది. జీ5లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రస్తుతం ఆడియెన్స్‌ను మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. 7.3 IMDb రేటింగ్‌తో పాటు, గూగుల్‌లో యూజర్ రేటింగ్ 4.6/5తో అత్యధికంగా సర్చ్ చేస్తున్న చిత్రంగా ‘మిసెస్’ సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమాను బవేజా స్టూడియోస్‌తో కలిసి జియో స్టూడియోస్ నిర్మించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందీ ప్రేక్షకులకు చూడటానికి అందుబాటులో ఉంది. కాగా.. ఈ చిత్రాన్ని సీనియర్ మేకర్స్, ప్రముఖ నటీనటులు దీన్ని ప్రశంసించారు.

READ MORE: Off The Record: అనుచరుల దందాలు ఆ టీడీపీ ఎమ్మెల్యేను ఇరుకున పెడుతున్నాయా?

ఈ సందర్భంగా ZEE5లో SVOD ఇండియా, గ్లోబల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ శ్రేష్ఠ్ గుప్తా మాట్లాడుతూ.. ఈ చిత్రానికి వచ్చిన అసాధారణ ఆదరణ చూసి అందరం సంతోషిస్తున్నామన్నారు. సమాజంలో అర్ధవంతమైన మార్పుకు దారితీసే కథనాలకు ZEE5 పెద్ద పీఠ వేస్తుందనే నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించారు. ఇలాంటి ఎన్నో సామాజిక సందేశాత్మక కథల్ని అందించేందుకు మున్ముందు ప్రయత్నిస్తూనే ఉంటామని తెలిపారు. “ఈ సినిమా జర్నీ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ చిత్రంపై వస్తున్న ప్రేమ, కురిపిస్తున్న ప్రశంసలు ఎప్పటికీ మర్చిపోలేను. ZEE5 ఈ కథకు ప్రాణం పోసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేసింది.” అని చిత్ర దర్శకురాలు ఆరతి కడవ్ తెలిపింది.