NTV Telugu Site icon

Fish Medicine: రాష్ట్రానికి రెండు లక్షల కొర్రమీనులు.. ఎందుకంటే..

Mrugasira Karte

Mrugasira Karte

Fish Medicine: హైదరాబాద్‌కు చెందిన బత్తిన కుటుంబం ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం పంపిణీ చేస్తుంది. ఈసారి కూడా చేప ప్రసాదం ఇవ్వనున్నారు. జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ చేస్తామని బత్తిని కుటుంబీకులు తెలిపారు.జూన్ 8న హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేపమందు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీలోని నల్గొండ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి కొర్రమి చేప పిల్లలను తెప్పిస్తున్నట్లు మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఒక్కో ముక్క ధర రూ. 40 ఉంటాయని.. సుమారు రెండు లక్షల కొర్ర చేపలు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు.

Read also: Exit Polls: నేడు ఎగ్జిట్‌ పోల్స్‌.. 19 రోజులుగా అభ్యర్థుల్లో టెన్షన్‌

కార్యక్రమంలో తొలిరోజు 8వ తేదీ ఉదయం 6 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేప పిల్లలను తీసుకురానున్నారు. జూన్ 8న పంపిణీ చేసేందుకు చేపమందు తయారు చేయడం ప్రారంభించామని బత్తిని కుటుంబీకులు తెలిపారు.మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం తీసుకుంటే ఉబ్బసం తగ్గుతుందని చాలా మంది నమ్ముతున్నారు. అందుకే తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, తమిళనాడు నుంచి కూడా వస్తుంటారు. బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదానికి 170 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. చేప మందు పంపిణీలో పాల్గొన్న బత్తిని సోదరుల్లో బత్తిని హరినాథ్ గౌడ్ ఒకరు. అతను 1944లో దూద్ బౌలిలో జన్మించాడు. హరినాథ్ గౌడ్ అమ్మమ్మ చేప మందు తయారు చేయడం నేర్పింది. హరినాథ్ తాతయ్య, నాన్నగారు చేప ప్రసాదం పంచినట్లే ప్రతి సంవత్సరం చేప ప్రసాదం పంచేవారు.
Counting Process: ఓట్ల లెక్కింపు.. జీహెచ్‌ఎంసీ పకడ్బందీ ఏర్పాట్లు..