వారణాసిలోని మల్హియా గ్రామంలో ఓ షాకింగ్ కేసు వెలుగు చూసింది. ఇక్కడ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 40 మంది కన్య యువతులను గర్భవతిగా ప్రకటించింది. మీరు పోషకాహార ట్రాకర్‌లో విజయవంతంగా నమోదు చేసుకున్నారని, తల్లిపాల సలహాలు, పెరుగుదల కొలత, ఆరోగ్య రిఫరల్ సేవలు వంటి వివిధ సేవలను పొందవచ్చని మంత్రిత్వ శాఖ నుంచి సందేశం రావడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
READ MORE: IND vs SA: నేడు భారత్-సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. మారిన టైమింగ్స్
మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌లో పోషకాహార సేవ గురించి కూడా ప్రస్తావించబడింది. ఈ మెసేజ్ చూసిన అమ్మాయిలు, వారి కుటుంబాల్లో కలకలం రేగింది. గ్రామపెద్దల ద్వారా ముఖ్య అభివృద్ధి అధికారి (సీడీఓ)కి ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించారు. ఈ విషయమై మొత్తం విచారించగా.. అంగన్‌వాడీ కార్యకర్త తప్పిదం వల్ల దాదాపు 40 మంది బాలికలకు ఈ మెసేజ్ వచ్చినట్లు తేలింది. ఈ సేవలు మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లల కోసం అందిస్తారు. అయితే.. ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న యువతుల పేర్లను అంగన్‌వాడీ కార్యకర్త పుష్టహార్‌లో నమోదు చేసింది. ఫలితంగా వీరికి తాము గర్భవతి అనే సందేశం వచ్చింది. ఆ తర్వాత అంగన్‌వాడీ కార్యకర్త చేసిన తప్పును అంగీకరించింది.
READ MORE:UP: ప్రియుడి వల్ల ఇద్దరు పిల్లలకు తల్లైన వివాహిత.. మూడోసారి గర్భం.. భర్త ఎలా గుర్తించాడంటే..
సందేశంలో…” అభినందనలు! మీ చిన్నారి న్యూట్రిషన్ ట్రాకర్‌లో విజయవంతంగా నమోదు చేయబడింది. మీరు అంగన్‌వాడీ కేంద్రం ద్వారా ఇంటి సందర్శన ద్వారా తల్లిపాల సలహాలు, పెరుగుదల కొలత, ఆరోగ్య సూచన సేవలు మరియు టీకాలు వేయడం వంటి సేవలను పొందవచ్చు. మరింత సమాచారం లేదా సహాయం కోసం 14408కి కాల్ చేయండి.- మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ.” అని రాసి ఉంది.