Thandel : అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత కొన్నేళ్లుగా విజయం కోసం నాగచైతన్య ఎంతో కష్టపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అతని ఆశలన్నీ ఈ సినిమా మీదనే పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో చైతన్య బెస్తవాడిగా కనిపించనున్నాడు. గుజరాత్ తీరంలో సముద్ర జలాల్లో చిక్కుకున్న శ్రీకాకుళానికి చెందిన జాలరి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు చందు మొండేటి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు దగ్గరైంది. మరి నాగ చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా ఈ చిత్రం వస్తుండగా ఆల్రెడీ వచ్చినా పాటలు ఈ సినిమాకి చార్ట్ బస్టర్స్ అయ్యి మరిన్ని అంచనాలు పెంచాయి.
Read Also:Kolusu Partha Sarathy: అర్హత కలిగిన పేదలకు ఇళ్ళు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం..
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ కట్ ని లాంచ్ చెయ్యడానికి మేకర్స్ ఫైనల్ గా ఓ డేట్ ఫిక్స్ చేసి ప్రకటించేశారు. దీనితో ఈ సినిమా ట్రైలర్ ని ఈ జనవరి 28న లాంచ్ చేస్తున్నట్టుగా నాగ చైతన్యపై ఒక ఇంటెన్స్ పోస్టర్ తో అధికారికంగా అనౌన్స్ చేశారు. మరి ఇందులో చైతన్య మంచి మాస్ అండ్ దగ్గుడ్ లుక్ లో కనిపిస్తున్నారు. సాలిడ్ యాక్షన్ సీన్ అన్నట్లుగా ఈ పోస్టర్ చూస్తే అర్ధం అవుతుంది. మరి ఈ 28న రానున్న ట్రైలర్ ఎలా ఉంటుందో వచ్చిన తర్వాత చూడాల్సిందే. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు మేకర్స్.
Read Also:ICC T20: ఐసీసీ ఉమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024.. ముగ్గురు భారత ప్లేయర్లకు చోటు