NTV Telugu Site icon

Patancheruvu: అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కొడుకుని హతమార్చిన కసాయి తల్లి..

New Project (3)

New Project (3)

ఓ కసాయి తల్లి అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్న కొడుకునే హతమార్చింది. ఈ ఘటన పటాన్ చెరులో చోటుచేసుకుంది. పటాన్‌చెరులోని ముత్తంగి వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డు ( ఓఆర్‌ఆర్‌ ) సర్వీస్‌ రోడ్డు పక్కన 10 ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని బాలుడి మృతదేహం ఈనెల 11న లభ్యమైంది. రోడ్డు పక్కన పొదల్లో పడి ఉన్న బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహంపై గాయాలు కూడా గుర్తించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించామని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని తెలిపారు. బాలుడి ఆచూకీ కోసం సంగారెడ్డి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లతో పాటు మూడు నగర కమిషనరేట్ల పరిధిలో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇంతలో పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి.

READ MORE: Karuna Bhushan: 11 ఏళ్ళ కొడుకు.. ఈసారి కవలలకు తల్లైన కరుణా భూషణ్

కాగా.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కన్న తల్లే కసాయిగా మారి కుమారుడిని పొట్టనపెట్టుకుందని తేలింది. స్వాతి అనే వివాహిత భర్త చనిపోవడంతో వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఈ నెల10న కొడుకు గొంతు నులిమి చంపేసింది. ప్రియుడు అనిల్ తో రాత్రి ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు పక్కన కలిసి విష్ణు (10) మృతదేహాన్ని పారేసింది. పోలీసుల విచారణలో స్వాతి స్వయంగా నేరాన్ని ఒప్పుకుంది. తల్లి స్వాతి, ప్రియుడు అనిల్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు.