Site icon NTV Telugu

Viral : నీటిలో మునిగిపోతున్న కాకిని కాపాడిన ఎలుగుబంటి..

Bear

Bear

ప్రేమ, సానుభూతి, ఎదుటి వారికి సాయం చేసే మనస్సు మనుషులకే కాదు.. జంతువుల్లో కూడా కనిపిస్తుంది. క్రూర జంతువులు కూడా ఒక్కోసారి జాలి చూపిస్తుంటాయి. అలాంటి వీడియోలు మనం ఎన్నో చూసి ఉంటాం.. అలాంటి వీడియోలు చూస్తుంటే మనుషుల కంటే జంతువుల్లోనే ప్రేమ, జాలిగుణం ఎక్కువగా కనపడుతుంది. అడవిలోని క్రూర మృగాలు ఎప్పుడూ ఇతర జంతువులను వెటాడే పని మాత్రమే చేస్తాయని మనం అనుకుంటుంటాం. కానీ, వేటాడే మృగాలు సైతం ఆపదలో ఉన్న మరో జీవి ప్రాణాలను కాపాడాతాయని నిరూపించే సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్‌ గా మారింది. నీటిలో పడి ప్రాణాలు కోల్పోతున్న ఓ కాకిని ఎలుగుబంటి కాపాడిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

Also Read : US Debt Ceiling Crisis: కుదరని ఏకాభిప్రాయం.. ఆర్థిక సంక్షోభం అంచున అమెరికా..

హంగేరిలోని బుదాపేస్ట్ జూలో ఈ సంఘటన జరిగింది. ఓ కొలను ఒడ్డు వద్ద కాకి ఒకటి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంది. అయితే అదే సమయంలో అక్కడికి ఓ ఎలుగుబంటి వచ్చింది. నీటిలో పడిపోయిన కాకి అరుపులు గమనించిన ఎలుగుబంటి ఆ కాకి వద్దకు వెళ్లి.. నీటిలో మునిగిపోతున్న కాకిని ఎలుగుబంటి చటుక్కున పట్టుకుని ఒడ్డున పడేసి సేవ్ చేసింది. తన నోటి సాయంతో కాకి రెక్కలను పట్టుకుని బయటకు ఆ ఎలుగుబంటి తీసింది. ఆ తర్వాత ఎలుగుబంటి తన దారిన తను అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. కొద్ది సేపటికి ఆ కాకి కూడా అక్కడి నుంచి ఎగిరిపోయింది.

Also Read : Virinchi Varma: ‘మజ్ను’ డైరెక్టర్ కొత్త సినిమా!

అయితే ఎలుగు బంటి కాకిని కాపాడిన తీరుకు సంబందించిన వీడియోను నెటివ్ ఆమెరికా సోల్ అనే ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయబడింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోని ఇప్పటికే 4.5 మిలియన్లకు పైగా వీక్షించారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో చాలా మంది షేర్ చేస్తూ.. లైక్ చేస్తున్నారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కాకిని కాపాడిన ఎలుగుబంటిపై నెటిజన్లు వెరైటీగా కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version