శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన ‘సామజవరగమన’ చిత్రం ఇటీవల విడుదల అయ్యి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా జూన్ 29 న విడుదల అయింది.ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ మూవీ మొదటి షోతోనే అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది.సినిమా పై ఉన్న పూర్తి కాన్ఫిడెన్స్ తో చిత్ర బృందం విడుదలకి మూడు రోజుల నుండి వేసిన ప్రీమియర్స్ సినిమాకు బాగా ఉపయోగ పడ్డాయి.ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు లేకుండానే ఈ మూవీ మంచి విజయం సాధించింది.హీరో శ్రీవిష్ణు కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు.మంచి హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న శ్రీవిష్ణుకి ఈ మూవీ పెద్ద ఊరటను ఇచ్చిందని చెప్పాలి. ‘సామజవరగమన’ చిత్రానికి ముందుగా శ్రీవిష్ణు ను హీరోగా అనుకోలేదని సమాచారం.హీరో సందీప్ కిషన్ ఈ సినిమా ఆఫర్ ను వదులుకుంటే ఈ ఆఫర్ వద్దకి శ్రీ విష్ణు వద్దకి వచ్చిందని సమాచారం..
సామజవరగమన’ చిత్రాన్ని రామ్ అబ్బరాజు తెరకెక్కించాడు.గతంలో ఇతను వివాహభోజనంబు అనే మంచి ఎంటర్టైన్ సినిమాని తీసాడు. ఈ సినిమాకు సందీప్ కిషన్ నిర్మాతగా వ్యవహారించాడు..అలాగే సందీప్ కూడా ఆ సినిమాలో ముఖ్య పాత్ర పోషించాడు. వివాహభోజనంబు ఓటీటీలో విడుదల అయ్యి సందీప్ కిషన్ కి లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో ‘సామజవరగమన కథని కూడా సందీప్ కిషన్ కె చెప్పాడట దర్శకుడు రామ్ అబ్బరాజు. అయితే సందీప్ కిషన్ ‘మైఖేల్’ అనే యాక్షన్ సినిమాతో బిజీగా ఉండటంతో ఈ స్క్రిప్ట్ ను అనిల్ సుంకరకు వద్దకి పంపినట్టు సమాచారం.అనిల్ సుంకర నిర్మాణంలో ‘ఊరు పేరు భైరవ కోన’ అనే సినిమా సందీప్ కిషన్ చేయడానికి అంగీకరించాడని తెలుస్తుంది.అందుకే ‘సామజవరగమన’ స్క్రిప్ట్ ను అనిల్ సుంకర వద్దకి సందీప్ పంపినట్టు సమాచారం.. ఈ విషయాన్ని కూడా అనిల్ సుంకర ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలా సందీప్ ఒక మంచి సినిమాను మిస్ అయ్యాడు.
