నేడు ఓటీటీలోకి రెండు క్రేజీ మూవీస్ స్ట్రీమింగ్ కు వచ్చేసాయి.ఆ క్రేజీ మూవీస్ ఏంటంటే ఒకటి టిల్లు స్క్వేర్ కాగా మరొకటి ఫ్యామిలీ స్టార్.సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది . 2022లో విడుదలైన డీజే టిల్లు చిత్రానికి ఈ సినిమా సీక్వెల్ గా వచ్చింది. డీజే టిల్లు కి మించి రెస్పాన్స్ టిల్లు స్క్వేర్ చిత్రానికి వచ్చింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 125 కోట్ల వసూళ్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.అలాగే యూఎస్ లో ఈ చిత్రం ఏకంగా 3 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టి అదరగొట్టింది. టిల్లు స్క్వేర్ చిత్రంతో సిద్ధూ జొన్నలగడ్డ ఇమేజ్ మరింత పెరిగింది.ఇదిలా ఉంటే మార్చి 29న విడుదలైన టిల్లు స్క్వేర్ నెల రోజులు గడవక ముందే నేడు(ఏప్రిల్ 26) ఓటీటీలోకి వచ్చేసింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం థియేటర్స్ లో సందడి ముగియక ముందే స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
టిల్లు స్క్వేర్ డిజిటల్ రైట్స్ ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. మాలిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.ఇదిలా ఉంటే నేడు ఓటిటిలోకి వచ్చిన మరో క్రేజీ మూవీ “ఫ్యామిలీ స్టార్”.రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న థియేటర్స్ లోకి రాగా మూడు వారాల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది.అయితే ఎన్నో అంచనాలతో వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. మొదటి షో నుండే ఈ మూవీ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేసింది .ఫ్యామిలీ స్టార్ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఫ్యామిలీ స్టార్ చిత్రాన్నీ పరశురామ్ తెరకెక్కించారు .స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.
