NTV Telugu Site icon

Kalki 2898 AD : ఆ విషయం నాకు సిల్లీగా అనిపించింది : నాగ్ అశ్విన్

Nag Ashwin Jpeg

Nag Ashwin Jpeg

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు .ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.అలాగే అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.దీనితో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచారు.ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ లభిస్తుంది.ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Read Also :Charith Maanas: అచ్చం మేనమామ పోలికలే.. వైరల్ గా మారిన మహేష్ బాబు అల్లుడు..

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న నాగ్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.కల్కి మూవీలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి బిగ్ స్టార్స్ నటించారు.అలాంటి బిగ్ స్టార్స్ ను డైరెక్ట్ చేయడం అంటే మాములు విషయం కాదు.అలాంటి లెజెండరీ యాక్టర్స్ వద్దకు వెళ్లి ఎలా చేయాలో చెప్పడం నాకు కొంచెం సిల్లీగా అనిపించింది.నిజానికి ఈ సినిమా తొలి షాట్ అమితాబ్ తో వుంది.ఆయనకు ఈ సినిమాలో చాలా మంచి సీన్స్ వున్నాయి.అమితాబ్ గారు అయినా లేదా కమల్ సార్ అయినా వాళ్ళు తమను డైరెక్ట్ చేయాలనే అనుకుంటారు.ఇండస్ట్రీ లో వాళ్ళు ఎంత ఎదిగిన నిరంతరం నేర్చుకుంటూనే వుంటారు.వాళ్ళ డెడికేషన్ కు హాట్స్ ఆఫ్ చెప్పాలి అని నాగ్ అశ్విన్ తెలిపారు.

Show comments