NTV Telugu Site icon

Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’లో ఆ స్టార్ హీరోలు..?

Kalki (3)

Kalki (3)

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.అలాగే అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి లెజెండరీ స్టార్స్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించారు.ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా వున్నారు.

Read Also :Bhairava Anthem : ఎట్టకేలకు ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..

ఇప్పటికే ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.అలాగే నిన్న మేకర్స్ ఈ చిత్రం నుండి భైరవ యాన్థం ఆడియో సాంగ్ రిలీజ్ చేసారు.అలాగే నేడు ఈ సినిమాకు సంబంధించి భైరవ యాన్థం వీడియో సాంగ్ ను రిలీజ్ చేసారు.ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో స్టార్ హీరోస్ దుల్కర్ సల్మాన్ ,విజయ్ దేవరకొండ ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు ఓ వార్త బాగా వైరల్ అవుతుంది.అయితే చిత్ర యూనిట్ మాత్రం దీని గురించి అధికారిక ప్రకటన ఏమి ఇవ్వలేదు.

Show comments