Site icon NTV Telugu

Kalki 2898 AD : “కల్కి” కర్ణాటక రైట్స్ పొందిన ఆ ప్రముఖ బ్యానర్..

Whatsapp Image 2024 05 10 At 10.51.56 Am

Whatsapp Image 2024 05 10 At 10.51.56 Am

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 ఏడి”..ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది..ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ,లోకనాయకుడు కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు .బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన మోషన్ పోస్టర్స్ ,గ్లింప్సె సినిమాపై భారీగా అంచనాలు పెంచేసాయి.

తాజాగా ఈ సినిమాలో అమితాబ్ అశ్వద్ధామ లుక్ ను రిలీజ్ చేస్తూ మేకర్స్ గ్లింప్సె వీడియో రిలీజ్ చేసారు .ఈ సినిమాలో హిందూ పురాణాల ఆధారంగా తెరకెక్కతున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమాలో ప్రభాస్ మహా విష్ణు అవతారంలో కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమాను మే 9 న రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావించారు..కాని కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. జూన్ 27 న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు.సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కుతుంది.ఇదిలా వుంటే ఈ సినిమా కర్ణాటక రైట్స్ ను ప్రముఖ బ్యానర్ “KVN ప్రొడక్షన్స్” సొంతం చేసుకుంది.కర్ణాటకలో ఈ సినిమాను KVN ప్రొడక్షన్స్ బ్యానర్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ట్వీట్ చేసారు .ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .

Exit mobile version