Vishwambhara : మెగాస్టార్ మూవీలో విలన్ గా నటించబోతున్న ఆ కోలీవుడ్ స్టార్ హీరో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమ గ్లోబల్ వైడ్ గా గుర్తింపు పొందటంతో తెలుగు సినిమాలలో ఇతర భాషల నటీనటులు నటిస్తుండడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ అయిపోయింది.ముఖ్యంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ విషయంలో ఇది మరింత ఎక్కువగా జరుగుతూ వస్తోంది. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ కొత్త సినిమాలోనూ ఓ తమిళ స్టార్ హీరో నటించబోతున్నట్లు తెలుస్తోంది.మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ సినిమాలో లో కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తాజా సమాచారం. సినిమాలో శింబు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతి, ఆర్య వంటి హీరోలు తెలుగు సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు.. అయితే ఇప్పుడు శింబు కూడా ఆ జాబితాలో చేరిపోయినట్లు తెలుస్తుంది.’విశ్వంభర’ సినిమాని మొదలుపెట్టి చాలా రోజులు అవుతోంది. ఇటీవల ఓ షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేశారు. కాకపోతే ఆ షెడ్యూల్ లో చిరంజీవి పాల్గొనలేదు.
ఇక తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి మొదటి వారంలో చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో చిరంజీవి మరియు హీరోయిన్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటివరకు సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై మూవీ టీమ్ క్లారిటీ ఇవ్వలేదు. గత కొద్ది రోజులుగా ఇందులో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలోనే హీరోయిన్ విషయమై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.’బింబిసార’ మూవీ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కునున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ సుమారు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
తాజావార్తలు
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు