NTV Telugu Site icon

ఒకే నెంబర్‌తో 3 ఆర్టీసీ బస్సులు… ఆర్టీవో అధికారుల షాక్‌

అదో ఆర్టీసీ బస్సు.. కానీ ఒకే నెంబర్‌తో మూడు బస్సులు ఉన్నాయి. ఈ విషయం ట్రాఫిక్‌ పోలీసులు చలాన్లు విధించే వరకు బయటికి రాలేదు. తెలంగాణ ఆర్టీసీలో ఒకే నెంబర్‌తో మూడు బస్సులు ఉండటం ఆశ్చర్యానికి గురి చేసింది. గరుడప్లస్‌, సూపర్‌లగ్జరీ, ఎక్స్‌ప్రెస్‌, ఈ మూడు బస్సులకు ఒకే నెంబర్‌ ఉంది.

ఆ మూడు బస్సులపై ఫైన్లు కూడా ఉన్నాయి. హైదరాబాద్‌ వన్‌ డిపోలో టీఎస్‌ 08 z 0208 ఉన్న బస్సు ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుగా నడుస్తుంది. హైదరాబాద్‌ 3 డిపోలో గరుడప్లస్‌ సర్వీస్ కూడా అదే నెంబర్‌పై తిరుగుతుండటం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ మూడు బస్సులను గుర్తించిన ఆర్టీఓ అధికారులు వాటిపై చలాన్లు విధించారు. ఒకే నెంబర్‌పై ఉన్న ఈ మూడు బస్సులకు హైదరాబాద్‌ పరిధిలో రెండు, సైబరాబాద్‌పరిధిలో రెండు చలాన్లు ఉన్నాయి. రాచకొండ, ఆదిలాబాద్‌, సిద్ధిపేట, కరీంనగర్‌ పరిధిలోనూ ఒక్కో చలాన్‌ ఉంది.

మొత్తంగా ఒకే నెంబర్‌పై ఎనిమిది చలాన్లు ఉన్నాయి. కానీ బస్సులు మాత్రం మూడు ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన ఆర్టీవో అధి కారులు అసలు వ్యవహారాన్ని గుర్తించారు. అసలు ఒకే నెంబర్‌ మీద మూడు బస్సులు ఎలా తిరుగుతున్నాయి..? ఆ బస్సులకు ఒకే నెం బర్‌ ఎందుకు కేటాయించారనేది తెలియదు. దీనిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

గతంలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యజమాన్యాలు ఒకే నెంబర్‌ మీద రెండు అంతకన్నా ఎక్కువ బస్సులు నడిపిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పు డు ఆర్టీసీలో సైతం ఇలాంటి ఘటనలు వెలుగు చూడటంతో ఆర్టీవో అధికారులు ఖంగుతిన్నారు. ఒకే నెంబర్‌ మీద మూడు బస్సు లు ఎలా తిరుగుతున్నాయి. ఈ ఘటన ఎలా జరిగిందని అటు టీఎస్ ఆర్టీసీ అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. ఈ బస్సులు ఎప్పటి నుంచి ఇలా తిరుగుతున్నాయి. ఇప్పటి వరకు దీన్ని ఎందుకు గుర్తించలేదని అధికారులు కూపీ లాగుతున్నారు.