Site icon NTV Telugu

Satyabhama : కాజల్ ‘సత్యభామ’ ఆంధ్ర రైట్స్ దక్కించుకున్న ప్రముఖ బ్యానర్..

Kajal

Kajal

Satyabhama : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తెలుగులో స్టార్ హీరోల సినిమాలలో నటించి మెప్పించిన కాజల్ తన సినీ కెరీర్ ఫుల్ స్వింగ్ లో వున్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లి తరువాత కాజల్ హీరోయిన్ గా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.గత ఏడాది బాలయ్య సరసన హీరోయిన్ గా నటించిన ‘భగవంత్ కేసరి’సినిమా మంచి విజయం సాధించింది.ప్రస్తుతం కాజల్ “సత్యభామ”అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా లో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది.

Read Also :Viswak Sen : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీ పార్టనర్ ఫిక్స్..

ఈ సినిమాలో నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్నాడు.సుమన్ చిక్కాల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను బాబీ తిక్క ,శ్రీనివాసరావు తక్కలపల్లి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందించారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి రీలీజ్ చేసిన పోస్టర్స్ ,టీజర్ ,సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ను నందమూరి బాలకృష్ణ లాంచ్ చేసారు.సత్యభామ పాత్రలో కాజల్ నట విశ్వరూపం చూపించింది.యాక్షన్ సీన్స్ తో అదరగొట్టింది.ఇదిలా ఉంటే ఈ సినిమా జూన్ 7 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఈ సినిమా మూవీ మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.సత్యభామ మూవీ ఆంధ్ర ప్రదేశ్ థియేటర్ రైట్స్ ను ధీరజ్ మొగిలినేని ఎంటెర్టైన్మెంట్స్ సొంతం చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ విషయం తెలియజేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.

Exit mobile version