India Is With Israel: హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై భీకరదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 200 మంది మరణించినట్లు ఇజ్రాయిల్ ఆర్మీ వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ గాజాపై వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో వందలకు పైగా పాలస్తీనియన్లు మరణిస్తున్నారు. తాము యుద్ధంలో ఉన్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు ప్రకటించారు. ఇజ్రాయిల్ పౌరులు, సైనికులను బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు హమాస్ మిలిటెంట్లు.
Read Also: Israel: గాజాను సర్వనాశనం చేస్తాం, ప్రజలు వదిలిపోండి.. ఇజ్రాయిల్ ప్రధాని వార్నింగ్..
ఇదిలా ఉంటే ఈ దాడిపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ కి అండగా ఉంటామని ప్రకటించారు. బైడెన్, రిషి సునాక్, మక్రాన్ వంటి ప్రపంచ నేతలు కూడా ఇజ్రాయిల్ కి మద్దతుగా నిలిచారు. ఇజ్రాయిల్ తనను తాను రక్షించుకునే పూర్తి హక్కు ఉందని ప్రపంచదేశాలు నొక్కి చెప్పాయి.
మరోవైపు మిత్రదేశం ఇజ్రాయిల్ కి భారత ప్రజలు అండగా నిలుస్తున్నారు. ఎక్స్(ట్విట్టర్)లో ‘‘ఇండియా ఈస్ విత్ ఇజ్రాయిల్’’ యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. భారత ప్రజలు ఇజ్రాయిల్‌కి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. హమాస్ ఉగ్రవాద దాడికి మద్దతు తెలిపిన నేపథ్యంలో భారత్‌కి ఇజ్రాయెల్ కృతజ్ఞతలు తెలిపింది. ఆ దేశ విదేశంగా శాఖ తన అధికార ఎక్స్(ట్విట్టర్) అకౌంట్ లో ‘‘థాంక్స్ ఇండియా’’ అంటూ ఇండియా ఈస్ విత్ ఇజ్రాయిల్ చిత్రాన్ని షేర్ చేసింది.