NTV Telugu Site icon

Minister Narayana: తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు డేట్స్ ఫిక్స్!

Minister Narayana

Minister Narayana

ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను కూటమిప్రభుత్వం ఒక్కటిగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో ‘తల్లికి వందనం’, ‘మహిళలకు ఉచిత బస్సు’ పథకాలకు డేట్స్ ఫిక్స్ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా జూన్ నుంచి తల్లికి వందనం, ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తాం అని మంత్రి నారాయణ చెప్పారు. మరోవైపు పాఠశాలలు మొదలుపెట్టే రోజున తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు అందిస్తామని ఆత్మకూరులో జరిగిన మినీ మహానాడు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు.

Also Read: Coronavirus: కరోనా వైరస్ పట్ల తక్షణ అప్రమత్తం.. ఆరోగ్యశాఖ సూచనలు జారీ!

కాకినాడ జిల్లా డీఆర్సీ మీటింగ్‌లో మంత్రి నారాయణ మాట్లాడుతూ… ‘గత ముఖ్యమంత్రికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియక రాష్ట్రాన్ని అతలా కుతలం చేశాడు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లిపోయింది. ఆ అప్పుల మనమే తీర్చాలి, తీర్చకపోతే ఊరుకోరు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా జూన్ నుంచి తల్లికి వందనం, ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తాం. ఒక మున్సిపల్ శాఖలోనే 3000 కోట్లు అప్పులు ఉన్నాయి. డ్యామా, మత్సశాఖ ఇబ్బందులు గురించి శాసనసభ్యులు చర్చించారు. దాదాపు 75 శాతం పనులు పూర్తయ్యాయి, మరో 25 శాతం పెండింగ్ ఉన్నాయి. ప్రతి నెల శాసనసభ్యులు అధికారులతో సమావేశం నిర్వహిస్తాను’ అని తెలిపారు.