Site icon NTV Telugu

Tvk Vijay : వెనక్కి తగ్గిన జననాయగన్ మేకర్స్.. మరోసారి సెన్సార్

Tvk Vijay

Tvk Vijay

దళపతి విజయ్ కెరీర్‌లో  చివరి సినిమాగా వస్తున్న చిత్రం జన నాయగన్. విజయ్ 69వ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా విడుదల తేదీ విషయంలో గత కొంతకాలంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సెన్సార్ బోర్డుతో జరుగుతున్న న్యాయపోరాటం కారణంగా సినిమా విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వినిపిస్తోంది.

Also Read : Exclusive : నేచురల్ స్టార్ నాని – డైరెక్టర్ శౌర్యువ్ సినిమా క్యాన్సిల్..

 ఇప్పటికే సినిమాను సెన్సార్ బోర్డుకు సమర్పించినప్పటికీ, కొన్ని అభ్యంతరాల వల్ల సెన్సార్ పనులు పెండింగ్ లో ఉన్నాయి. మద్రాస్ హైకోర్టులో ఈ సెన్సార్ వివాదంపై విచారణ జరుగుతోంది. కోర్టు నుంచి తుది తీర్పు వెలువడిన తర్వాతే సెన్సార్ సర్టిఫికేట్ లభిస్తుంది. అప్పటివరకు చిత్ర యూనిట్ అధికారికంగా ఏ విషయాన్ని ధృవీకరించలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 20 నిమిషాల ఫుటేజ్ ను తొలగించి కొన్ని డైలాగ్స్ ను మ్యూట్ చేసి మరోసారి సెన్సార్ చేసేందుకు పంపారు మేకర్స్. సెన్సార్ నుండి ఎటువంటి అడ్డంకులు లేకుంటే ఈ నెల 13న లేదా చివరి వారంలో రిలీజ్ చేసే అవకాశం ఉంది.   మరోవైపు జననాయగన్ రిలీజ్ వాయిదా పడడంతో నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్ ఆర్డిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ సినిమా రిలీజ్ అయితే కానీ తమ ప్రొడక్షన్ లో తరువాత సినిమాలలో విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version