Site icon NTV Telugu

Thalapathy Vijay : ప్రజల కోసమే ఈ నిర్ణయం.. దళపతి విజయ్ తండ్రి వైరల్ కామెంట్

Vijay

Vijay

నటుడు దళపతి విజయ్ ఇటీవల కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చెన్నైలో జరిగిన ఓ ఫంక్షన్‌ల ఆయన తండ్రి, నిర్మాత ఎస్.ఏ. చంద్రశేఖర్ విజయ్ గురించి మాట్లాడుతూ.. కొన్ని గట్టి వ్యాఖ్యలు చేశారు. విజయ్ కేవలం సినిమాలకే పరిమితమై ఉంటే, ఈ పాటికి ఇంకా చాలా డబ్బు సంపాదించేవాడని చెప్పారు.. ‘‘మా అబ్బాయి విజయ్ డబ్బును మాత్రమే నమ్మే వ్యక్తి కాదు. సులభంగా సినిమాలు చేసి కోట్లు సంపాదించగలడు. కానీ, వాటన్నిటినీ వదులుకొని తమిళనాడు ప్రజలకు సేవ చేయాలనేదే అతని మనసులో ఉన్న ఏకైక కోరిక. అందుకే రాజకీయాల్లోకి వచ్చాడు’’ అని చంద్రశేఖర్ తెలిపారు. అలాగే తన కొడుకును దివంగత ముఖ్యమంత్రి ఎం.జి.ఆర్ (MGR) తో పోల్చిన ఆయన, ఎంజీఆర్ లాగే విజయ్ కూడా తన సినిమాల ద్వారానే సమాజంపై ప్రేమ పెంచుకున్నాడని, ముఖ్యంగా ఏ.ఆర్. మురుగదాస్ తీసిన ‘తుపాకీ’ లాంటి సినిమాలు అతనిపై చాలా ప్రభావం చూపాయని వివరించారు.

Also Read : Stranger Things 5 Part 2:ఇండియాలో రికార్డ్ బ్రేకింగ్ సిరీస్ ఫైనల్ ఎపిసోడ్స్ ఎప్పుడంటే..

ఇక విజయ్ సినీ కెరీర్ విషయానికి వస్తే, ఆయన చివరి చిత్రం.. హెచ్. వినోత్ దర్శకత్వంలో వస్తున్న ‘జన నాయగన్’. తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయడానికి సినిమాలకు గుడ్ బై చెబుతున్న విజయ్ ఫ్యాన్స్ కోసం, ఈ సినిమాను జనవరి 9, 2026 న పొంగల్ సందర్భంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. అంతకుముందు, వెంకట్ ప్రభు డైరెక్షన్‌ల్లో వచ్చిన ‘ది GOAT’ చిత్రంలో చివరిసారిగా విజయ్ కనిపించారు. మొత్తానికి, డబ్బు కన్నా ప్రజల సేవకే విజయ్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఆయన తండ్రి వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Exit mobile version