Site icon NTV Telugu

Thalapathy 68 : టైటిల్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత అర్చనా కల్పతి..

Whatsapp Image 2023 12 20 At 8.37.13 Pm

Whatsapp Image 2023 12 20 At 8.37.13 Pm

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఈ ఏడాది లియో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన కూడా కలెక్షన్స్ భారీగా వచ్చాయి.ఇదిలా ఉంటే విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దళపతి 68”. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమాలో ప్రశాంత్‌, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్‌ మరియు జయరాం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి బాస్‌ లేదా పజిల్ టైటిల్స్‌ ను పరిశీలిస్తున్నారంటూ నెట్టింట వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.తాజాగా ఈ పుకార్లపై నిర్మాత అర్చనా కల్పిత సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. సినిమా ఇంకా ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాకు “బాస్ లేదా పజిల్” టైటిల్‌ పెట్టలేదు. సినిమా టైటిల్ ఏంటనేది త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని తెలియజేశారు.

డిసెంబర్ 31న టైటిల్‌ మరియు ఫస్ట్‌ లుక్‌తోపాటు జనవరి 1న సెకండ్‌ పోస్టర్‌ రానుందని వార్తలు వస్తుండగా.. దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.ఈ సినిమా లో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న కిచ్చా సుదీప్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్‌ దళపతి 68లో భాగమవడం ఎంతో సంతోషంగా ఉంది. వన్‌ అండ్ ఓన్లీ దళపతి విజయ్‌తో స్క్రీన్‌ షేర్ చేసుకునే అవకాశమిచ్చిన వెంకట్‌ ప్రభుకు ధన్యవాదాలు. సార్ ఎప్పుడూ నాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తి.. అంటూ వెంకట్‌ ప్రభుతో దిగిన ఫొటోను సుదీప్ షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది.పొలిటికల్‌ థ్రిల్లర్‌ జోనర్‌ లో పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ డ్యుయల్ రోల్‌ లో నటిస్తున్నాడని సమాచారం.ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ బ్యాన ర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version