Thalapathy 68 : టైటిల్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత అర్చనా కల్పతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఈ ఏడాది లియో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన కూడా కలెక్షన్స్ భారీగా వచ్చాయి.ఇదిలా ఉంటే విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దళపతి 68”. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమాలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్ మరియు జయరాం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి బాస్ లేదా పజిల్ టైటిల్స్ ను పరిశీలిస్తున్నారంటూ నెట్టింట వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.తాజాగా ఈ పుకార్లపై నిర్మాత అర్చనా కల్పిత సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. సినిమా ఇంకా ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాకు “బాస్ లేదా పజిల్” టైటిల్ పెట్టలేదు. సినిమా టైటిల్ ఏంటనేది త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని తెలియజేశారు.
డిసెంబర్ 31న టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌తోపాటు జనవరి 1న సెకండ్ పోస్టర్ రానుందని వార్తలు వస్తుండగా.. దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.ఈ సినిమా లో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న కిచ్చా సుదీప్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ దళపతి 68లో భాగమవడం ఎంతో సంతోషంగా ఉంది. వన్ అండ్ ఓన్లీ దళపతి విజయ్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశమిచ్చిన వెంకట్ ప్రభుకు ధన్యవాదాలు. సార్ ఎప్పుడూ నాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తి.. అంటూ వెంకట్ ప్రభుతో దిగిన ఫొటోను సుదీప్ షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది.పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ లో పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ డ్యుయల్ రోల్ లో నటిస్తున్నాడని సమాచారం.ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ బ్యాన ర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
Also Read
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
Just saw all the updates. Thank you for the love ❤️ Keep calm and wait for the real one very soon @vp_offl is cooking something special. It is definitely not Boss or Puzzle 😊 Happy Morning everyone ❤️ #Thalapathy68
— Archana Kalpathi (@archanakalpathi) December 20, 2023
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!