NTV Telugu Site icon

Vettaiyan : తలైవా ‘వేట్టైయన్’ డిజిటల్ రైట్స్ పొందిన ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్..?

Vettaiyan

Vettaiyan

Vettaiyan : సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు.జైలర్ సినిమా రజనీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.భారీగా కలెక్షన్స్ కూడా సాధించింది.ఈ సినిమా తరువాత తలైవా తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించిన ” లాల్ సలాం” సినిమాలో గెస్ట్ పాత్రలో నటించారు.కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.ప్రస్తుతం రజనీకాంత్ వరుస సినిమాలతో బిజీ గా వున్నారు.తలైవా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “వేట్టైయన్”..ఈ సినిమాను జై భీమ్ టిజె జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా రజనీ కెరీర్ లో 170 వ మూవీగా తెరకెక్కుతుంది.

Read Also :Devara : ముగింపు దశకు చేరుకున్న దేవర షూటింగ్..?

ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.త్వరలోనే మేకర్స్ ఈ విషయంపై అధికారికంగా స్పందించనున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.అలాగే ఫహద్ ఫాసిల్ ,రానా దగ్గుబాటి ,రితికాసింగ్ వంటి తదితరులుకీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Show comments