Lal Salaam : తలైవా నటించిన లాల్ సలాం మూవీ సంక్రాంతికి రానట్టేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఏడాది విడుదల అయిన జైలర్ మూవీ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. జైలర్ మూవీ రజనీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసిన సూపర్ స్టార్ ఆయా సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు.ఇక ఇప్పుడు ‘లాల్ సలామ్’ విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జైలర్ మూవీతో సూపర్ స్టార్ సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన తలైవా.’ లాల్ సలామ్ ‘ అనే మూవీలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాను 2024 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది… ఈ సినిమాలో రజనీ డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నారు.
తాజాగా తలైవా పుట్టినరోజు సందర్భంగా కొత్త టీజర్‌ను విడుదల చేశారు. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని చూడాలని రజనీ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు లాల్ సలాం రిలీజ్ డేట్ వాయిదా పడుతుందనే గాసిప్ మొదలైంది.2024 సంక్రాంతి పండుగకి ‘లాల్ సలామ్’ చిత్రాన్ని విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ పండగ సందర్భంగా స్టార్ హీరోల సినిమాలు చాలా రిలీజ్ కానున్నాయి. అదే సమయంలో ‘లాల్ సలామ్’ కూడా విడుదలైతే ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రావని భావించిన మేకర్స్. ఆ కారణంగానే ‘లాల్ సలామ్’ విడుదల తేదీ వాయిదా వేసే అవకాశం ఉందని అంటున్నారు.అయితే ‘లాల్ సలామ్’ విడుదల తేదీ వాయిదాపై అధికారిక సమాచారం ఇంకా చిత్ర బృందం నుండి బయటకు రాలేదు. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక ‘లైకా ప్రొడక్షన్స్’ నిర్మిస్తోంది. అదే నిర్మాణ సంస్థలో రజనీకాంత్ 170 వ చిత్రం ‘వెట్టయాన్’ మూవీ తెరకెక్కుతుంది.. ఈ చిత్రానికి టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!