TGTET 2026: టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. జనవరి 3 నుంచి ఆన్లైన్ పరీక్షలు..

Tgtet

Tgtet

TGTET 2026: తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET) జనవరి -2026 పరీక్షల షెడ్యూల్‌ను సంబంధిత అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలు జనవరి 3 నుంచి జనవరి 20 వరకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మొత్తం 9 రోజుల్లో 15 సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో ప్రతి రోజూ రెండు సెషన్ల చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు.

Shocking Incident: దారుణం.. చిన్నారిని థర్డ్ ఫ్లోర్ నుంచి కింద పడేసిన కన్న తల్లి

×
×
Ad

సెషన్–I పరీక్ష ఉదయం 9.00 గంటల నుంచి 11.30 గంటల వరకు కొనసాగుతుంది. సెషన్–II పరీక్ష మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షలకు అభ్యర్థులు ముందుగానే హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని, పరీక్ష కేంద్రాలకు సమయానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.

Andhra King Thaluka : ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ డేట్..?