Site icon NTV Telugu

TGSRTC : SSC, ITI చదివారా..? ఆర్టీసీలో జాబ్ ఛాన్స్ మీకోసం

Sajjanar Tgsrtc

Sajjanar Tgsrtc

TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) 2025–26 విద్యా సంవత్సరానికి ఐటీఐ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. హైదరాబాద్‌ శివారులోని హకీంపేట్‌లో ఉన్న TGSRTC ఐటీఐ కాలేజీలో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ఆసక్తి గల విద్యార్థులు టీజీఎస్‌ఆర్‌టీసీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఈ నెల 28. ఈ ఐటీఐ కాలేజీలో మెకానిక్‌ (మోటార్‌ వెహికల్‌), మెకానిక్‌ డీజిల్‌, వెల్డర్‌, పెయింటర్‌ ట్రేడ్‌లలో శిక్షణ ఇవ్వబడుతుంది. మెకానిక్‌ డీజిల్‌, వెల్డర్‌ కోర్సులు ఒక సంవత్సరం వ్యవధి కలిగి ఉంటే, మెకానిక్‌ (మోటార్‌ వెహికల్‌), పెయింటర్‌ కోర్సులు రెండేళ్లపాటు కొనసాగుతాయి. ఎనిమిదో తరగతి చదివిన వారు వెల్డర్‌, పెయింటర్‌ కోర్సులకు అర్హులు. పదో తరగతి ఉత్తీర్ణత ఉన్న వారు మెకానిక్‌ (మోటార్‌ వెహికల్‌) మరియు మెకానిక్‌ డీజిల్‌ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని కోర్సులకూ వార్షిక ఫీజు రూ.16,500గా నిర్ణయించారు.

Death Note web series: వెబ్ సిరీస్ ప్రభావం.. నేను వెళ్లే సమయం ఆసన్నమైంది.. అంటూ?

మరిన్ని వివరాల కోసం 9100664452, 6302649844, 040-69400000 నంబర్లను సంప్రదించవచ్చని సంస్థ తెలిపింది. ఇక, రాష్ట్రంలో ల్యాబ్‌ టెక్నీషియన్‌, స్టాఫ్‌ నర్సు నియామకాల ప్రక్రియ కూడా వేగవంతం అవుతోంది. మరో రెండు రోజుల్లో ల్యాబ్‌ టెక్నీషియన్‌ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. మొదట ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితాను ప్రకటించి, అనంతరం 1,284 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులను భర్తీ చేస్తారు. స్టాఫ్‌ నర్సు పరీక్ష ఫలితాలు కూడా త్వరలో వెలువడనున్నాయి. వీటి ఆధారంగా 2,322 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయడానికి వైద్య నియామక బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.

’పెద్ది’ కోసం కీలక వ్యక్తిని తీసుకొచ్చిన రామ్ చరణ్‌

Exit mobile version