Site icon NTV Telugu

Group-2 Exam: ఈ నెల 15,16 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు.. 9 నుంచి హాల్‌టికెట్లు

Tgpsc

Tgpsc

Group-2 Exam: ఈ నెల 15,16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 1368 పరీక్ష కేంద్రాలలో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 9 నుంచి హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని.. ఆ రోజు నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. ఉదయం సెషన్‌లో 8.30 నుంచి 9.30 గంటల వరకు..మధ్యాహ్నం పరీక్షకు 1.30 గంటల నుంచి 2.30 వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు. తర్వాత వచ్చిన వారికి పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇవ్వరని అభ్యర్థులకు టీజీపీఎస్సీ సూచనలు చేసింది.

Read Also: Bandi Sanjay: రేవంత్ రెడ్డి.. నిన్ను విడిచే పెట్టే పరిస్థితి లేదు.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Exit mobile version