Site icon NTV Telugu

TGEAPCET 2025: టీజీఈఏపీ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే

Tg Eapcet

Tg Eapcet

టీజీఈఏపీ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ రిలీజ్ చేసింది. మూడు విడతల్లో ఈఏపీసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. మొదటి విడత కౌన్సిలింగ్ కి జూన్ 28 నుంచి జులై 7వ తేదీ వరకు స్లాట్ బుక్ కింగ్ కి అవకాశం ఇచ్చారు. జులై 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మొదటి విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్.. జులై 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు.. జులై 14,15 తేదీల్లో మొదటి మాక్ సీట్ల కేటాయింపు ప్రక్రియ.. జులై 18వ తేదీ లోపు మొదటి విడత సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు.

Also Read:Manchu Manoj : మా అన్న అదరగొట్టాడు.. ప్రభాస్ వచ్చాక వేరే లెవల్..

జులై 25 నుంచి ఫేజ్ 2 టీజీఈఏపీసెట్ సెట్ కౌన్సిలింగ్.. జులై 25న నుంచి రెండో ఫేజ్ స్లాట్ బుక్ కింగ్.. జులై 26 నుంచి రెండో ఫేజ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్.. జులై 26,27 తేదీల్లో రెండో ఫేజ్ వెబ్ ఆప్షన్లకు అవకాశం.. జులై 30వ తేదీ లోపు రెండో ఫేజ్ సీట్ల కేటాయింపు.. జులై 31 నుంచి ఆగస్టు 2వ తేదీ లోపు విద్యార్థులు కళాశాలల్లో వ్యక్తిగతంగా రిపోర్ట్ చేయాలి.

Also Read:TG SSC Supplementary Result 2025: పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల

ఆగస్టు 5వ తేదీ నుంచి మూడో విడత కౌన్సిలింగ్.. ఆగస్టు 5న స్లాట్ బుక్ కింగ్.. ఆగస్టు 6వ తేదీన ఫైనల్ ఫేజ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్.. ఆగస్టు 6 ,7 తేదీల్లో ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్లకు అవకాశం.. ఆగస్టు 10వ తేదీ లోపు ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు.. ఆగస్టు 11 నుంచి 13వ తేదీలోపు విద్యార్థులు కళాశాలల్లో వ్యక్తిగతంగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 18, 19 తేదీల్లో ఇంటర్నల్ స్లైడింగ్ ఆప్షన్లకు అవకాశం.. ఆగస్టు 22వ తేదీలోపు ఇంటర్నల్ స్లైడింగ్ సీట్ల కేటాయింపు ఉంటుంది.

Exit mobile version