Green Fund Fee: తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) కీలక ఆదేశాలు జారీ చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల నుండి ‘రికగ్నిషన్ ఫీజు’, ‘గ్రీన్ ఫండ్ ఫీజు’ లను వసూలు చేయాలని అన్ని జూనియర్ కళాశాలల (ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మినహా) ప్రిన్సిపాల్స్‌ను బోర్డు ఆదేశించింది.
Income Tax: ఈ 10 రకాల లావాదేవీలపై ఐటీ కన్ను.. జాగ్రత్త పడకపోతే నష్టమే..!
ఇక ఫీజుల వివరాలు చూస్తే.. రికగ్నిషన్ ఫీజు కింద ఒక్కో విద్యార్థికి రూ. 220 వసూలు చేయాలని సూచించింది. అలాగే గ్రీన్ ఫండ్ ఫీజు కింద ఒక్కో విద్యార్థికి రూ. 15 వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ మొత్తం ఫీజులను 2025-26 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ కోర్సులో చేరిన ప్రతి విద్యార్థి నుండి సేకరించాలని సూచించారు. వసూలు చేసిన ఈ మొత్తాలను అక్టోబర్ 24 నుండి అక్టోబర్ 31 లోపు TGBIE ఖాతాలో ఆన్‌లైన్ బదిలీ (Online Transfer) ద్వారా చెల్లించాలి. ఈ చెల్లింపు ప్రక్రియ కోసం CGG వెబ్ పోర్టల్ tgbie.cgg.gov.in ను ఉపయోగించాలని బోర్డు స్పష్టం చేసింది. ఇక, ప్రభుత్వ జూనియర్ కళాశాలల (Government Junior Colleges) విద్యార్థులకు ఈ రికగ్నిషన్ ఫీజు, గ్రీన్ ఫండ్ ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఇచ్చారు.
Digital Payments: దేశంలో డిజిటల్ పేమెంట్స్ హవా.. 6 నెలల్లో దాదాపు 100% లావాదేవీలు ఆన్‌లైన్‌లోనే..
