NTV Telugu Site icon

TG Vishwa Prasad: మిస్టర్ బచ్చన్ వివాదం.. హరీష్ శంకర్ పై ట్వీట్ చేసిన టీజీ విశ్వప్రసాద్

Harish Shankar

Harish Shankar

TG Vishwa Prasad Clarity on Comments Against Harish Shankar: మిస్టర్ బచ్చన్ సినిమా రిజల్ట్ విషయంలో హరీష్ శంకర్ మీద నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఆధారంగా చేసుకుని రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే వీటి మీద స్పందిస్తూ విశ్వప్రసాద్ తాజాగా ఒక ట్వీట్ చేశారు. హరీష్ శంకర్ తనకు ముందు ఫ్రెండ్ అని ఆ తర్వాతే ఒక సినిమా చేశామని చెప్పుకొచ్చారు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో నేను నేర్చుకున్న కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఒకవేళ సినిమా సక్సెస్ అయితే అన్ని పాజిటివ్స్ కనపడతాయి. అలా కాకుండా కొంత ఇబ్బంది పడినా చాలా విషయాల్లో ఫీడ్బ్యాక్ వస్తుంది. అది కచ్చితంగా మనం తీసుకోవాల్సిందే అని ఆయన అన్నారు.

HYDRA Comissioner : కూల్చివేతల వెనుక రాజకీయ హస్తం ఉందా.? హైడ్రా కమిషనర్‌ సంచలన ఇంటర్వ్యూ

నేను హరీష్ మీద కామెంట్ చేశాను అనే మాట నిజం కాదు, నేను ఆయనతో కలిసి మరో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాను. ఫిలిం మేకింగ్ లో ఆయనకు ఎక్స్ట్రార్డినరీ టాలెంట్ ఉందని నేను నమ్ముతున్నాను. అలాగే డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు అని తెలిసి తన రెమ్యునరేషన్ నుంచి ఆ నష్టాలు పూడ్చేందుకు ముందుకొచ్చిన మంచి మనిషి హరీష్ శంకర్. కాబట్టి మీడియా ఈ విషయంలో ఆలోచించి ఉన్న విషయాన్ని రాయాలి, దయచేసి ఎక్కువ చేసి రాయొద్దని కోరుకుంటున్నాను. మేము నేర్చుకున్న అన్ని విషయాలను బేరీజు వేసుకుని ఒక మంచి సినిమాతో వచ్చేందుకు సిద్ధమవుతున్నాం అంటూ విశ్వప్రసాద్ చెప్పుకొచ్చారు. నిజానికి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా మరీ అంత బాడ్ కాదు కానీ ప్రమోషన్స్ సమయంలో హరీష్ శంకర్ కొంత ఎటాకింగ్ మోడ్ లో ఉండడం వల్ల అది రిజల్ట్ మీద భారీగా ప్రభావం చూపింది అని అర్థం వచ్చేలా మాట్లాడారు.

Show comments