ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..

Tgeapcet

Tgeapcet

TG EAPCET 2026: టీజీఈఏపీసెట్–2026 (TG EAPCET 2026) ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ ఏడాది కౌన్సెలింగ్‌లో మొత్తం 94,156 సీట్లు అందుబాటులో ఉండగా, 75,054 సీట్లు భర్తీ అయ్యాయి. 19,102 సీట్లు ఖాళీగా మిగిలిపోవడంతో మొత్తం భర్తీ శాతం 80గా నమోదైంది. కాగా ఈడబ్ల్యూఎస్ కోటా కింద 5,771 మంది అభ్యర్థులకు సీట్లు లభించాయి. సీటు పొందిన విద్యార్థులు ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ మరియు కాలేజీలో రిపోర్ట్ చేయడానికి ఆగస్టు 7 చివరి తేదీగా అధికారులు ఖరారు చేశారు.

ఈసారి విద్యార్థులు ఏఐ, ఐటీ సంబంధిత కోర్సులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సీఎస్ నెట్‌వర్క్స్, రోబోటిక్స్ & ఏఐ కోర్సుల్లో 100% సీట్లు భర్తీ అయ్యాయి. ఓవరాల్‌గా కంప్యూటర్ సైన్స్ & ఐటీ సంబంధిత కోర్సుల్లో 82% సీట్లు భర్తీ కాగా, అందులో సైబర్ సెక్యూరిటీలో 92%, సీఎస్‌ఈ (ఏఐ & ఎంఎల్)లో 86%, కంప్యూటర్ సైన్స్ (CSE)లో 84%, ఐటీలో 80%, మరియు డేటా సైన్స్‌లో 79% చొప్పున సీట్లు నిండాయి. కోర్ ఇంజినీరింగ్ విభాగాల విషయానికి వస్తే, ఈసీఈ (ECE) విభాగంలో 79% సీట్లు భర్తీ కాగా, సివిల్ ఇంజినీరింగ్‌లో 69%, ఈఈఈ (EEE) లో 65%, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 64% సీట్లు భర్తీ అయ్యాయి.