NTV Telugu Site icon

Terror plans Busted: భారీ పేలుళ్ళకు కుట్ర.. కదులుతున్న ఉగ్రమూలాల డొంక

Kutra

Kutra

హైదరాబాద్ నగరంపై ఉగ్రమూకల కన్ను ఎప్పుడూ పడుతూనే వుంటుంది. నగరంలో భారీ పేలుళ్ల కుట్ర కేసును హైదరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. లష్కరే తోయిబా నేత ఘోరీ ఆదేశాల మేరకు నగరంలో విధ్వంసానికి కుట్ర పన్నారు. ఇంటిలిజెన్స్ అధికారుల సమాచారం మేరకు నిన్న పాతబస్తీ పరిసర ప్రాంతంలో సోదాలు చేసి జాహిద్ సహా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.. వారి వద్ద నుండి భారీ ఎత్తున పేలుడు పదార్థాలు నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కోర్టులో హాజరు పర్చడంతో రిమాండ్ విధించి చంచల్ గూడ జైల్ కు తరలించారు. నిందితులను కస్టడీకి తీసుకొని విచారిస్తే ఉగ్ర మూలాల డొంక మరింతగా కదిలే అవకాశం ఉంది.

హైదరాబాద్ లో ఉగ్రకుట్రకు సంబంధించి సిసిఎస్ ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు ఉన్నాయి. ఈకేసును సిట్ కు బదిలీ చేసిన సిసిఎస్ విభాగం. నగరంలో బీజేపీ,ఆరెస్సెస్ కార్యక్రమాలు,దసరా ఉత్సవాలను జాహిద్ అండ్ టీమ్ టార్గెట్ చేసిందని కనుగొన్నారు. దసరా రోజు జరిగే ఉత్సవాల్లో వరుస పేలుళ్లకు భారీ కుట్ర పన్నారు. A1జాహిద్ A2సమీఉద్ధిన్, A3హజీ హసన్ లు అరెస్ట్ చేసి నిందితులపై సెక్షన్ 18, 18(B),20 ఆఫ్ 1967 యాంటి సోషల్ ఎలవెంట్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. జాహిద్‌తోపాటు ఏడుగురిపై కేసు నమోదు చేసిన సిసిఎస్ పోలీసులు. అదీల్ అఫ్రోజ్, అబ్దుల్ హై, సోహెల్ ఖురేషి, అబ్దుల్ కలీమ్‌లపై సైతం కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్ లో దాడుల కోసం పాకిస్థాన్ బేస్ హండ్లర్స్ నుంచి నాలుగు హాండ్ గ్రేనేడ్స్ హైదరాబాద్ కు చేరాయి.

నిర్మానుష్య ప్రాంతంలో హ్యాండ్ గ్రానడ్ పేల్చేందుకు ట్రైల్ నిర్వహిస్తుండగా సమాచారంతో పోలీసులు అలర్ట్ అయి ముగ్గురిని అరెస్ట్ చేశారు. గతంలో సైతం జాహిద్‌ అండ్ టీంపై పలు టెర్రరిస్ట్ కుట్ర కేసులు ఉన్నాయి. అరెస్టైన వారు అబ్దుల్ జాహిద్, సమిఉద్దీన్ అలియాస్ సమీ, మాజా అలియాస్ హసనన్ లు ముగ్గురు నిందితులను టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఉంచి విచారించారు. అనంతరం భారీ బందోస్తు మధ్య నిందితులను గాంధీ హాస్పిటల్ కు తరలించిళవైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తి ముందు హాజరు పర్చడంతో న్యాయస్థానం 14రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించగా వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

Read Also: Football Association : ఫుట్‌బాల్ అసోసియేష‌న్ ఆఫీసులో చోరీ

సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో మొత్తం ఏడుగురి పేర్లను పెర్కొన్నారు. వారిలో జాహిద్, మాజ్, సమీఉద్దీన్, ఆదిల్ అఫ్రోజ్, అబ్దుల్ హై, సోహెల్ ఖురేషీ, అబ్దుల్ ఖలీమ్ పేర్లున్నాయి. అయితే ఈ కేసులో తొమ్మిది మందిని కీలకంగా భావిస్తున్నారు సిట్ పోలీసులు. వీరంత పాక్ హ్యాండ్లర్ తో టచ్ లో ఉంటూ, అక్కడి హ్యాండ్లర్ల సూచనల మేరకు జాహిద్ సిటీలో టీం ఫాం చేసుకున్నట్లు గుర్తించారు. డబ్బాశ చూపి పేదరికంలో ఉన్న యువతను లక్ష్యంగా చేరికలు జరిగినట్లు గుర్తించారు. దిల్ షుక్ నగర్ బ్లాస్ట్ సమయంలో కీలకంగా వ్యవహరించి పరార్ అయిన వ్యక్తి బిలాల్ సోదరుడే జాహిద్ గా దర్యాప్తు అధికారులు గుర్తించారు.

పాక్ లో జరిగిన గ్యాంగ్ వార్ లో బిలాల్ మరణించాడు. బిలాల్ పాక్ లో ఉన్న సమయంలో విస్తరింప జేసిన నెట్వర్క్ లో ఉన్న కీలక వ్యక్తులతో ప్రస్తుతం జాహేద్ కు లింక్స్ ఉన్నాయిని గుర్తించారు. ఎంతమంది పాక్ హ్యాండర్లతో సంబంధాలు కల్గి ఉన్నారనే కోణంలో ఆరా తీస్తున్నారు. పాక్ ఉగ్ర వాద సంస్థ ఐసిసి, లష్కరే తోయిబా అనుబంధంగా వీరి మాడ్యూల్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఉనికి చాటడానికి నగరంలో పేలుల్లకు పథక రచన జరిగినట్లు ఈ మేరకు ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. మరి కొంతమంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తే మరిన్ని ఉగ్రవాద కుట్ర కోణాలు వెలుగుచేసే అవకాశం ఉంది.

Read Also: Tamannaah Bhatia: రెడ్ చీర లో తమన్నా.. అందమే అసూయ పడునమ్మా

Show comments