Chennai: తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. ద్రవిడ నిర్మాణ శైలిలో రూపొందించబడిన ఈ ఆలయంలో విష్ణుమూర్తి వివిధ రూపాలు భక్తులను కనువిందుచేస్తాయి. 156 ఏకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయం ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలలో ఒకటి. ఆలయంలోని విష్ణుమూర్తి శయనరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు.
Read Also:Goodachari 2: #SeshEXShruti… ఈ గూఢచారి హీరోయిన్ ని కూడా కొత్తగా రివీల్ చేసాడు
ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అయ్యప్ప భక్తులు వెళ్లారు. ఈ క్రమంలో వారికి అనుకోని సంఘటన ఎదురైంది. ఆ ఆలయ సిబ్బంది ఆంధ్ర అయ్యప్ప భక్తులపై తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. దీంతో రంగనాథ ఆలయంలో ఉద్రిక్తత ఏర్పడింది. దాదాపు పదుల సంఖ్యలో భక్తులు సిబ్బంది దాడిలో గాయపడ్డారు. దీంతో అయ్యప్ప భక్తులు ఆలయం వెలుపల ధర్నాకు దిగారు. గాయపడినా భక్తులకు స్దానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏపీ భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also:Sabarimala : శబరిమల ఆలయంలో భక్తుల రద్దీ.. నిర్వహణలోపంపై నిరసన తెలిపిన కాంగ్రెస్ ఎంపీలు
ఈ ఆలయంలో 21 గోపురాలు, 39 మంటపాలు ఉన్నాయి. 236 అడుగుల ఎత్తులో నిర్మించబడిని రాజగోపురం ఆలయ ప్రధాన గోపురంగా చెప్పబడింది.. ఇది ఆసియా ఖండంలోని రెండవ ఎత్తైన ఆలయ గోపురం. ఈ ఆలయంలో 1000 స్థంభాలతో రూపొందిన అతి పెద్ద హాలు మరో ప్రత్యేకత. ఇక స్వామి వారి విగ్రహం కూడా తేనె, కర్పూరం, గంధం, బెల్లం, కస్తూరి, తైలం ఉపయోగించి తయారు చేశారు. ఈ ఆలయం 10వ శతాబ్థానికి పూర్వమే నిర్మించబడినట్లు చరిత్రలో ఆధారాలు ఉన్నాయి.