Telugu Devotees Attacked in Sabarimala: శబరిమలలో ఉద్రిక్తత నెలకొంది.. తెలుగు రాష్ట్రాల నుంచి దర్శనానికి వెళ్లిన కొందరు అయ్యప్ప భక్తులు మరియు స్థానిక దుకాణదారుల మధ్య జరిగిన వాగ్వాదం పెద్దదిగా మారడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం ప్రకారం, ఒక దుకాణంలో నీటి బాటిల్ ధరపై భక్తులు ప్రశ్నించగా, ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా భక్తులలో ఒకరు గాయపడినట్లు తెలిసింది. సంఘటన వివరాలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన తెలిసిన వెంటనే అక్కడ ఉన్న ఇతర తెలుగు భక్తులు కూడా ఆ దుకాణం వద్దకు చేరుకోవడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. మరోవైపు, చుట్టుపక్కల ఉన్న కొంతమంది దుకాణదారులు కూడా అక్కడికి రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అక్కడికి చేరుకుని భక్తులను, వ్యాపారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు.. అయితే, కొందరు భక్తులు పోలీసుల చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. పరిస్థితి ప్రస్తుతం పోలీసుల పర్యవేక్షణలో ఉంది. ఘర్షణకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.
Read Also: Road Accident: ఏపీలో మరో ప్రమాదం.. ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి..
కాగా, ప్రతీ ఏడాది శబరిమలకు పెద్ద సంఖ్యలో తెలుగు భక్తులు వెళ్తూనే ఉంటారు.. అయ్యప్పమాల ధరించి.. మండల పూజలు చేసి.. శబరిమల వెళ్తారు.. అయితే, కొన్ని సార్లు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. మరోవైపు, ఇవాళ దాడికి గురైన అయ్యప్ప భక్తులు ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి ప్రాంతానికి చెందినవారు.. మొత్తం 10 మంది అయ్యప్ప భక్తులు తిరుపతి నుంచి శబరిమల వెళ్లగా.. ఈ ఘటన చోటు చేసుకుంది.. అయితే, వారికి తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులు అంతా మద్దతుగా నిలిచారు..
