Site icon NTV Telugu

Teenmaar Mallanna: ఎమ్మెల్సీ కవితపై వ్యాఖ్యలు.. తీన్మార్ మల్లన్న కార్యాలయంపై కార్యకర్తల దాడి..!

Mlc Mallannna

Mlc Mallannna

Teenmaar Mallanna: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో జాగృతి కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి లోనై తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడికి దిగారు. ఈ సంఘటన హైదరాబాద్‌ మేడిపల్లిలోని మల్లన్న కార్యాలయంలో చోటుచేసుకుంది. జాగృతి కార్యకర్తలు మల్లన్న ఆఫీసుకు చేరుకొని నినాదాలు చేస్తూ కార్యాలయ గేట్లు ధ్వంసం చేసి లోపలికి చొచ్చుకుపోయారు. వారు కార్యాలయ ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.

Read Also:CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ..!

ఈ పరిస్థితుల్లో తీన్మార్ మల్లన్నకు సెక్యూరిటీగా ఉన్న గన్‌మెన్ గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఇది మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. కాల్పుల శబ్దంతో సమీప ప్రాంత ప్రజల్లో కలవరం నెలకొంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కార్యాలయం వద్దకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ దాడుల ఘటనలో మల్లన్న ఆఫీస్ కార్యాలయం రక్తసిక్తమైంది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అధికారులు తీన్మార్ మల్లన్న గన్‌మెన్ కాల్పుల అంశాన్నీ సమగ్రంగా పరిశీలిస్తున్నారు.

Read Also:Police Harassment: మహిళా సిఐ వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో రికార్డ్..!

Exit mobile version