ఉత్తరాది రాష్ట్రాలలో భానుడు భగభగమంటున్నాడు. వడగాల్పులతో ఉత్తర భారతమంతా వేడెక్కుతోంది. సగటున 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు వేడి తీవ్రతతో అవస్థలుపడుతున్నారు. యుపిలోని ప్రయాగ్‌రాజ్‌లో అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఈ నెల 17 వరకు వేడిగాలుల ప్రభావం కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. మహారాష్ట్ర, నాసిక్, రాజస్థాన్ మరియు ఢిల్లీ వంటి ప్రాంతాలు ముఖ్యంగా ప్రభావితమయ్యాయి, ప్రజలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. బావులు ఎండిపోవడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోంది. కొన్ని చోట్ల అధికారులు స్పందించి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.
Impact of Severe Heatwaves: ఉత్తరాదిలో నిప్పులు కురిపిస్తున్న భానుడు..(వీడియో)
- నిప్పులు కురిపిస్తున్న భానుడు
Show comments