Site icon NTV Telugu

Sandeep Chakravarthi: సెల్యూట్..! ఉగ్రకుట్ర భగ్నం కేసులో ఈ తెలుగు అధికారి పాత్ర కీలకం..

Jk

Jk

Sandeep Chakravarthi: జమ్మూకశ్మీర్ ఉగ్రకుట్ర భగ్నం కేసులో ఓ తెలుగు అధికారి కీలకంగా వ్యవహరించారు. కర్నూలుకు చెందిన సందీప్ చక్రవర్తి కేసులో మొదట లీడ్ ఇచ్చారు. ప్రస్తుతం శ్రీనగర్ SSPగా విధులు నిర్వర్తిస్తున్నారు తెలుగు తేజం సందీప్ చక్రవర్తి.. పెహల్గాం ఎటాక్ తర్వాత చేపట్టిన మహాదేవ్ ఆపరేషన్ లోనూ కీలకంగా వ్యవహరించారు. జైషే మహమ్మద్ పోస్టర్లను మొదట గుర్తించారు. పోస్టర్లు అంటించిన వారిని సీసీ కెమెరాలు ద్వారా గుర్తించారు. ముగ్గురు నిందితులపై గతంలో స్టోన్ పెల్టింగ్ కేసులు ఉన్నట్లు గుర్తించారు.

READ MORE: Investments in Amaravati: రూ.50,000 కోట్ల లక్ష్యం.. పలు రంగాల్లో భారీ పెట్టుబడులు..!

సోఫియాన్, ఇర్ఫాన్ అహ్మద్‌లను అరెస్టు చేసి రెండు వారాల పాటు విచారించారు. వాళ్లు ఇచ్చిన సమాచారంతోనే డాక్టర్ల టెర్రర్ ప్లాట్ బయటికి వచ్చింది. కాగా.. ప్రస్తుతం డాక్టర్స్ టెర్రర్ మాడ్యుల్ లో అరెస్టుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఫరీదాబాద్ తనిఖీల్లో 358 కేజీ పేలుడు పదార్థంతోపాటు 2563 కేజీల సామాగ్రిని స్వాధీనం జమ్మూకశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు సంవత్సరాలుగా ఈ మెటీరియల్‌ను సమకూర్చినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి.

READ MORE: Bihar Elections 2025: ఏడు ప్రముఖ సంస్థల ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలు ఇవే.. షాక్ అవ్వాల్సిందే..!

Exit mobile version