Site icon NTV Telugu

Polavaram–Nallamala: పోలవరం-నల్లమల్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రాజెక్ట్‌కు చెక్ పెట్టే దిశగా..

Polavaram

Polavaram

Telangana to File Objections in Supreme Court on Polavaram–Nallamala Sagar Case: పోలవరం-నల్లమల్ల సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో అభ్యంతరాలు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది. 13వ తేదీ పోలవరం-బనకచర్ల సుప్రీంకోర్టు కేసుపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 12 గంటలకు సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. 13వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు అభిషేక్ మను సింఘ్వితో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు.

READ MORE: Karthi : తమిళ హీరో ‘కార్తీ’ కోసం కథలు రెడీ చేస్తోన్న టాలీవుడ్ దర్శకులు

కాగా.. ఏపీ అక్రమంగా చేపడుతున్న పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు చెక్ పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పోలవరం బనకచర్ల లింక్​లో మార్పులు చేసి నల్లమలసాగర్ వరకు తరలించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం.. ఇటీవలే దాని డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్)కు టెండర్లను పిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నల్లమలసాగర్ లిం​క్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. సెంట్రల్​ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ), నేషనల్ వాటర్ డెవలప్​మెంట్ ఏజెన్సీ(ఎన్​డబ్ల్యూడీఏ), పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ(పీపీఏ), కృష్ణా బోర్డు, గోదావరి బోర్డులు అభ్యంతరాలు తెలిపినా.. ఏపీ మొండిగా ముందుకెళ్తుండడాన్ని ప్రభుత్వం సీరియస్​గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అన్ని ఆధారాలతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం..

Exit mobile version