Teachers Transfer : టీచర్ల బదిలీలకు దరఖాస్తు గడువు సోమవారంతో ముగిసింది. దీంతో ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థనల మేరకు ట్రాన్స్ ఫర్లకు దరఖాస్తు గడువును పెంచారు. కానీ షెడ్యూల్ లో మాత్రం మార్పు ఇవ్వలేదు. టీచర్లు దరఖాస్తు చేసిన తర్వాత హెచ్‌ఎంలు.. వాటిని డీఈ వోలకు సమర్పించే మూడు రోజుల కాలపరిమితిని కుదించనున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా ఈ నెల 28న ట్రాన్స్ ఫర్ల ప్రక్రియ ప్రారంభమైనా కొన్ని ఆప్షన్లు తెరుచుకోలేదు. మరికొన్ని అప్‌గ్రేడ్ కాలేదు. మారు మూల ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యలూ ఎదురయ్యాయి.
Read Also: Huge Fire : మధ్య ప్రదేశ్ లో భారీ అగ్నిప్రమాదం.. రూ.కోట్ల ఆస్తి నష్టం
దీంతో దరఖాస్తు గడువును పొడిగించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 55,500మంది టీచర్లు ట్రాన్సఫర్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ఎక్కువ అప్లికేషన్లు నల్లగొండ (3,423), రంగారెడ్డి (3,034) జిల్లాలనుంచి వచ్చాయి. అత్యల్పంగా హనుమకొండ (635), జయశంకర్ భూపాలపల్లి (500), ములుగు (379) ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 వేల మంది టీచర్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో 20 వేల వరకూ అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు, సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also: Gangula Kamalakar : ప్రజలను ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకే ఉంది