Holidays: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. నేడు(శనివారం) బీసీ వర్గాల హక్కుల సాధన కోసం, 42 శాతం రిజర్వేషన్ల చట్టబద్ధత డిమాండ్‌తో రాష్ట్ర బంద్‌కు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో అన్ని విద్యాసంస్థలు సెలవును ప్రకటించాయి. మరునాడు అక్టోబర్ 19 ఆదివారం కావడంతో అది వారపు సెలవు. ఆ మరుసటి రోజు, అంటే అక్టోబర్ 20 దీపావళి సెలవు. ఈ విధంగా సండే కలిసిరావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు లభించాయి. పాఠశాలలు, కళాశాలలు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడతాయి. పండగ వేళ వరుస సెలవులు రావడంతో విద్యార్థులు ఎగిరిగంతేస్తున్నారు.
READ MORE: BC Bandh: తెలంగాణలో బీసీ బంద్.. రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమం లైవ్ అప్‌డేట్స్..
మరోవైపు.. నేడు రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణలో ఉద్యమం ఉధృత రూపం దాలుస్తోంది.. నేడు రాష్ట్ర బంద్‌కు బీసీ సంఘాల జేఏసీ పిలుపు ఇచ్చింది.. బంద్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి అన్ని రాజకీయ పక్షాలు, బీసీ సంఘాలు.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌తో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు రోడ్డుక్కుతున్నారు.. రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతో జరుగుతోన్న బీసీ సంఘాలు బంద్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. అందరూ సహకరించి.. ఈ బంద్‌ను విజయంగా మార్చాలని బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది.
READ MORE: Telangana Bandh: నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్.. విద్యా సంస్థలకు సెలవు..!
