Site icon NTV Telugu

విపత్కర సమయంలో కేంద్ర సహకారం భేష్: తమిళ సై

ప్రధాని నరేంద్ర మోదీతో గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ గురువారం భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు సమావేశం జరిగింది. తెలంగాణ, పాండిచ్చేరి లోని తాజా పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించారు. ప్రధానికి పీఎం అండ్ పీఎం, మరో పుస్తకాన్ని గవర్నర్ తమిళ సై అందించారు. కోవిడ్ విపత్కర సమయంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు అన్ని విధాలుగా సహకారం అందిందని తమిళ సై తెలిపారు.

ఆమె మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రం సమర్థవంతంగా అన్ని చర్యలు తీసుకుంటుంది. మందుల సరఫరా, ఆక్సిజన్ సరఫరా అన్ని విషయాలను కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు సహాయ సహకారాలు అందించింది. కొవిడ్ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న చర్యలను వివరిస్తూ రాసిన పుస్తకాన్ని స్వయంగా ప్రధానికి అందజేశాను. తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ ను ఎదుర్కోవడంలో సమర్థంగా పని చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తుంది.

కోవిడ్ అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసింది. హైటెక్ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంది తెలంగాణ ప్రభుత్వం.. అంతేకాదు, ఈ కొత్త విధానాన్ని అనుభవాన్ని పుదుచ్చేరిలో ఉపయోగించుకున్నాము. తెలంగాణ పుదుచ్చేరి మధ్య మంచి అనుబంధాన్ని ఏర్పడటానికి ఈ కార్యక్రమం తోడ్పడిందన్నారు.

Exit mobile version