నష్టాల కారణంగా తెలంగాణలో ఆర్టీసీ బస్సు డిపోలు మూసివేస్తున్నారని.. గత రెండు రోజుల నుంచి ఓ వార్త వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై స్వయంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. బస్సు డిపోలను మూసేస్తున్నారు.. భూములు అమ్ముతున్నారనే వార్తలు వస్తున్నాయని… కానీ, ఆర్టీసీ యాజమాన్యానికి అలాంటి ఆలోచన లేదన్నారు సజ్జనార్. ఆర్టీసీ బస్సు డిపోలు మూసివేస్తున్నారనేది పూర్తి అవాస్తవమని వెల్లడించారు.
ఆర్టీసీ చార్జీలను పెంచాల్సిన అవసరం ఉందని.. కొన్ని కారణాల వల్ల ఆర్టీసీ బస్సులు, సిబ్బందిని మార్పులు చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడిప్పుడే ప్రజలు ఆర్టీసీ వైపు మల్లుతున్నారని… యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయం వల్ల ఆదాయం పెరిగిందన్నారు. 1359 రూట్లలో ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించామని… బస్సులు అవసరం ఉన్న చోట సర్వే చేస్తున్నామన్నారు. కొన్ని చోట్ల ఆక్యుపెన్సీ తక్కువ..కొన్నిచోట్ల ఎక్కువ ఉంది.. ఎవరికైనా బస్సు అవసరం ఉంటే డిపో మేనేజర్ ను సంప్రదించాలని కోరారు.. ఉద్యోగుల సంక్షేమం ఆర్టీసీకి చాలా ముఖ్యమని తెలిపారు సజ్జనార్. బస్ స్టాండ్ లలో ఎలాంటి పార్కింగ్ దందా లేదని స్పష్టం చేశారు.
