Telangana Real Estate: రియల్ ఎస్టేట్ సంస్థలకు తెలంగాణ రెరా షాక్.. భారీ జరిమానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రియల్ ఎస్టేట్ రంగంలో నిబంధనలను తుంగలో తొక్కుతున్న నిర్మాణ సంస్థలకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (తెలంగాణ రెరా) షాక్ ఇచ్చింది. ప్రాజెక్టుల పేరుతో కొనుగోలుదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి, సకాలంలో నిర్మాణాలు పూర్తి చేయకపోవడం, ఫ్లాట్లు, ప్లాట్ల అప్పగింతలో తీవ్ర జాప్యం చేయడం, ఇచ్చిన రిఫండ్ హామీలను అమలు చేయకపోవడంపై అథారిటీ స్పందించింది. నిబంధనలు ఉల్లంఘించిన పలు సంస్థలకు భారీ జరిమానాలు విధించడంతో పాటు, కొనుగోలుదారులకు వడ్డీతో సహా సొమ్మును తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇందులో భాగంగా.. మంచిరేవులలో రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే ‘సనాలి ది ఎడ్జ్’ ప్రాజెక్టును ప్రచారం చేస్తున్న ‘సనాలి ఐటీ పార్క్స్’ సంస్థపై రెరా కొరడా ఝుళిపించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఆ సంస్థకు ఏకంగా రూ.25 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని 30 రోజుల్లోగా చెల్లించాలని, రెరా రిజిస్ట్రేషన్ పొందే వరకు సదరు ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల ప్రకటనలు, బుకింగ్లు, విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది.
Also Read
- IPL 2027 Retention List: వేలానికి సిద్ధమైన స్టార్లు.. కోట్లు పలికిన ఆటగాళ్లను వదులుకున్న ఫ్రాంచైజీలు.. లిస్ట్ ఇదే..
- Viral Video: క్వాడ్ సమావేశంలో జాతీయ జెండాకు గౌరవం.. మోడీ చేసిన పని వైరల్..
- Dosa Making Tips : దోస వేసే ముందు పెనంపై నీళ్లు ఎందుకు చల్లుతారు?.. దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
- IPL Retention: లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి సామ్ కర్రన్.. DC నుంచి ముగ్గురు స్టార్ ఆటగాళ్లు ఔట్..
మరోవైపు.. కొనుగోలుదారులకు సకాలంలో ఫ్లాట్లు అప్పగించకుండా, రిఫండ్ విషయంలో నిర్లక్ష్యం వహించిన పలు నిర్మాణ సంస్థలకు రెరా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రకారం, వాసవి రియల్టర్స్ ఎల్ఎల్పీ కొనుగోలుదారుడికి చెల్లించాల్సిన రూ.49 లక్షల 50 వేలపై ఏడాదికి 10.85 శాతం వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి. అలాగే త్రిపుర కన్స్ట్రక్షన్స్ రూ.41 లక్షల 85 వేలు, ఎస్వీఎం ఆదిత్య హోమ్స్ రూ.27 లక్షల 16 వేలు, భువన తేజ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రూ.26 లక్షలు, ఆదిత్య స్క్వేర్స్ రూ.17 లక్షలు, బీవీఆర్ ఇన్ఫ్రా రూ.7 లక్షల చొప్పున కొనుగోలుదారులకు వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది.
అంతేకాకుండా.. మియాపూర్లోని ‘అరైన్ ఎమరాల్డ్’ ప్రాజెక్టులో ఫ్లాట్ నంబర్ 502ను కొనుగోలుదారుడికి తక్షణమే అప్పగించాలని ‘అరైన్ ఇన్ఫ్రా’ సంస్థను రెరా ఆదేశించింది. తాము జారీ చేసిన ఈ ఆదేశాలను నిర్లక్ష్యం చేసినా, ఉల్లంఘించినా రెరా చట్టంలోని సెక్షన్ 63 ప్రకారం అదనపు జరిమానాలు, కఠిన చర్యలు తప్పవని అథారిటీ స్పష్టం చేసింది. ఈ తాజా నిర్ణయాలతో నిర్మాణ సంస్థల జవాబుదారీతనం, కొనుగోలుదారుల హక్కుల పరిరక్షణపై తెలంగాణ రెరా మరోసారి తన కఠిన వైఖరిని చాటుకుంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Telangana Real Estate: రియల్ ఎస్టేట్ సంస్థలకు తెలంగాణ రెరా షాక్.. భారీ జరిమానాలు..
-
IPL 2027 Retention List: వేలానికి సిద్ధమైన స్టార్లు.. కోట్లు పలికిన ఆటగాళ్లను వదులుకున్న ఫ్రాంచైజీలు.. లిస్ట్ ఇదే..
-
Viral Video: క్వాడ్ సమావేశంలో జాతీయ జెండాకు గౌరవం.. మోడీ చేసిన పని వైరల్..
-
Jimmy Tata: టాటా గ్రూప్లో అసలైన ట్విస్ట్.. రతన్ టాటా తమ్ముడి ఎంట్రీతో మారిన లెక్కలు!
-
Dosa Making Tips : దోస వేసే ముందు పెనంపై నీళ్లు ఎందుకు చల్లుతారు?.. దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!