Site icon NTV Telugu

TG POLYCET Result 2025: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల.. బాలికలదే హవా

Poycet

Poycet

తెలంగాణ పాలిసెట్ పలితాలు విడుదలయ్యాయి. సాంకేతిక విద్యా కమిషనర్ శ్రీ దేవ సేనా ఫలితాలను రిలీజ్ చేశారు. పాలిసెట్ ఉత్తీర్ణత 84.33 శాతంగా నమోదైంది. పాలిసెట్ లోనూ బాలికలదే హవా కొనసాగింది. గోరుగంటి శ్రీజ, తుమాటి లాస్య శ్రీ 120 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. ప్రవేశ పరీక్షకు 1,06,716 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 98,858 అభర్థులు హాజరయ్యారు. వీరిలో 83,364 అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. హాజరైన 53085 బాలురకు గాను 42836 మంది అనగా 80.69 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Also Read:KTR: నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరును చేర్చడం తెలంగాణకే ఎంతో అవమానం

ఇదేవిధంగా హాజరైన 45773 బాలికలకు గాను 40528 మంది అనగా 88.54 శాతం ఉత్తీర్ణత సాధించారు. పాలిసెట్ లో అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించుటకు 120 మార్కులకు గాను నిర్ణీత 30 శాతం అనగా 36 మార్కులు సాధించాల్సి ఉంటుంది. SC,ST అభ్యర్థులకు నిర్ణీత ఉత్తీర్ణతకు 01 మార్కు పొందవలెను. పాలిసెట్-2025 లో సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా అభ్యర్థులకు మెరిట్ ర్యాంకులు కేటాయించనున్నారు. 18039 మంది SC విద్యార్థులకు గాను ఉత్తీర్ణత సాధించిన 18037 మందికి ర్యాంకులను ఇవ్వటం జరిగినది. అదేవిధంగా 7459 మంది ST విద్యార్థులకు గాను ఉత్తీర్ణత సాధించిన 7459మందికి ర్యాంకులను కేటాయించారు. ఫలితాల కోసం www.polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి చూసుకోవచ్చు.

Exit mobile version