Telangana Police Websites Hacked: తెలంగాణలో హ్యాకింగ్ బెడద రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా ఏకంగా పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారు. సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్‌సైట్‌లు పది రోజులుగా పని చేయడం లేదు. ఇటీవల హై కోర్టు వెబ్‌సైట్ హ్యాక్ తరువాత పోలీసుల వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారు కేటుగాళ్లు.. సైట్‌లోని లింక్‌లు ఓపెన్ చేస్తుంటే బెట్టింగ్ సైట్‌లకు రీ-డైరెక్ట్ అవుతోంది. దీంతో ఐటీ విభాగం సర్వర్లు డౌన్ చేసింది. వెబ్‌సైట్‌లు పని చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు వెబ్‌సైట్‌లతో పాటు ప్రభుత్వ కీలక వెబ్‌సైట్‌లను NIC నిర్వహిస్తోంది. హ్యాకింగ్ ముఠాలపై సైబర్ క్రైమ్ పోలీసులతో NIC బృందం సమన్వయం చేస్తోంది.
READ MORE: IND vs SA: విశాఖ నగరంలో క్రికెట్ సందడి.. హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు!
ఇదిలా ఉండగా.. ఇటీవల సైబర్ నేరగాళ్లు తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారు. ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేస్తున్న క్రమంలో ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్ ఓపెన్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులను ఆశ్రయించారు. పీడీఎఫ్ ఫైల్స్‌కు బదులు BDG SLOT అనే బెట్టింగ్ సైట్ ఓపెన్ అవుతోంది అంటూ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత నెల 11వ తేదీన ఈ సంఘటన చోటుచేసుకుంది. 11వ తేదీనే హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెబ్‌సైట్ హ్యాక్ చేసిన వారిని కనుక్కునే పనిలో పడ్డారు. వెబ్‌సైట్‌లోని సమస్యను క్లియర్ చేశారు. తెలంగాణ హైకోర్టుకు చెందిన ఈ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రతీ కేసుకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంటాయి. హ్యాకర్లు ఏకంగా ఈ సైట్‌నే హ్యాక్ చేశారు.
