SIT Issues Notice to KTR: తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కి నోటీసులు ఇచ్చింది సిట్. రేపు విచారణకి రావాలని ఆదేశించింది. ఉదయం 11 గంటలకు విచారణకి రావాలని నోటీసుల్లో పేర్కొంది సిట్.
READ MORE: Ramdas Athawale: ఆ పని చేస్తే ఎక్కువ నిధులు ఇస్తాం.. సీఎం పినరయి విజయన్‌కు ఎన్డీయే ఆఫర్..
ఇదిలా ఉండగా.. గత రెండ్రోజుల కిందట మాజీ మంత్రి హరీష్‌రావును సిట్ అధికారులు 7 గంటలపాటు విచారించారు. అయితే.. విచారణ ముగిసిన అనంతరం తెలంగాణ భవన్‌కు చేరుకున్న హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమకు ఉద్యమాలు కొత్త కాదని, మీలాగా పారిపోలేదని విమర్శించారు. ఈ అక్రమ కేసులు సమైక్య రాష్ట్రంలో చాలా పెట్టారని, మీరు ఇచ్చిన నోటీసులు తాము గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఉదయం మీ బామ్మర్ది బాగోతం బయట పెడితే సాయంత్రం తనకు నోటీసులు ఇచ్చారన్నారు. తాజాగా కేటీఆర్‌కు సైతం నోటీసులు ఇవ్వడంతో ఈ కేసుపై ఆసక్తి నెలకొంది.
READ MORE: Mental Health: పిల్లలకు భరించలేని హింస.. పేరెంట్స్, టీచర్ల దెబ్బకు టీనేజ్‌లోనే మెంటల్ టార్చర్!
