Site icon NTV Telugu

Fuel Shortage: “అందుకే బంకుల్లో స్టాక్ ఖాళీ అవుతోంది”.. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ బిగ్ వార్నింగ్

Telangana Petrol

Telangana Petrol

Telangana Petroleum Dealers Association: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరతపై డీలర్స్ అసోసియేషన్ క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి అమరేందర్ రెడ్డి పేరిట ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ఇంధన కొరత లేదని, జనాలు పానిక్ అవ్వొద్దని స్పష్టం చేశారు. ఇంధన కొరత గురించి తప్పుడు, తప్పుదోవ పట్టించే వార్తలు ప్రచారం కావడం వల్ల చాలా మంది పెట్రోల్ బంకులకు పరుగులు తీసి అనవసరంగా తమ ట్యాంకులను నింపుకుంటున్న విషయం మా దృష్టికి వచ్చిందని నోట్‌లో పేర్కొన్నారు. ఈ భయాందోళన కొనుగోళ్ల కారణంగా అమ్మకాలు సాధారణ స్థాయిల కంటే దాదాపు 2.5 నుంచి 3 రెట్లు అసాధారణంగా పెరిగాయన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న అనేక రిటైల్ అవుట్‌లెట్లలో స్టాక్ తాత్కాలికంగా అయిపోయిందని పేర్కొన్నారు.

READ MORE: Redmi Note 15 SE 5G: రెడ్ మీ నోట్ 15 SE 5G లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 5520mAh బ్యాటరీ & 108MP కెమెరా

ఇంధనం కొరత లేదని, HPCL, IOCL, BPCL వద్ద తగినంత స్టాక్ అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. ఇంధన సరఫరా సాధారణంగానే కొనసాగుతోందన్నారు. అనంతరం కొందరికి వార్నింగ్‌ ఇచ్చారు. పెట్రోల్ లేదా డీజిల్ను డబ్బాలలో నిల్వ కోసం తీసుకువెళ్లడం PESO నిబంధనలకు విరుద్ధమని.. తీవ్రమైన భద్రతా ప్రమాదాన్ని కలిగిస్తుందని స్పష్టం చేశారు. ఇంధనాన్ని సరిగ్గా నిల్వ చేయకపోవడం అగ్ని ప్రమాదాలతో సహా ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చని.. ఇది ఇంధనాన్ని నిల్వ చేయడానికి సురక్షితమైన లేదా ఆమోదించబడిన పద్ధతి కాదన్నారు. ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేశారు. భయాందోళనలకు గురికాకుండా ఇంధనాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. నకిలీ వార్తలను నమ్మవద్దు లేదా ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

Exit mobile version